సూపర్ స్టార్ కృష్ణ పార్థివదేహాన్ని బీజేపీ చీఫ్ బండి సంజయ్ సందర్శించి ఘనంగా నివాళులర్పించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ తెలుగు చిత్ర పరిశ్రమ కృష్ణ చేసిన సేవలను ఎన్నటికీ మర్చిపోదన్నారు.
ఆయన పేరు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని కొనియాడారు.తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం వస్తే హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై కృష్ణ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు.
అదేవిధంగా కృష్ణకు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చే విధంగా బీజేపీ తరపున కేంద్ర సర్కార్ కు సిఫార్సు చేస్తామని వెల్లడించారు.