గోల్డెన్ గ్లోబ్ అవార్డుకు ఎంత గొప్పతనం, విలువ ఉంది ? తెర వెనక వాస్తవాలు

రాజమౌళి సినిమా ఆర్ ఆర్ ఆర్ చిత్రం లో నాటు నాటు పాటకు గాను గోల్డెన్ గ్లోబ్ వరించింది అనే సంగతి మన అందరికి తెలిసిందే.అయితే ఈ అవార్డు కి ఎంత వరకు నాణ్యత ఉంది ? అంతకంటే ముందు ఒకసారి ఆస్కార్ అవార్డ్స్ గురించి చిన్న ప్రస్తావన ఉంది.నిజానికి ఆస్కార్ బరిలో ఉన్న సినిమాల్లో మన ఇండియా నుంచి 10 సినిమాలు ఉన్నాయ్.అందులో ఒకటి రెండు మినహా మిగతావి అన్ని కూడా లాబీయింగ్ తోనే వెళ్లాయి అని ఒప్పుకోవాల్సిందే.

 Golden Globe Award Greatness Capacity Rrr Details, Golden Globe Award, Golden Gl-TeluguStop.com

గుజరాత్ నుంచి చెల్లెషో అనే చిత్రం మాత్రమే ఎలాంటి ప్లానింగ్ లేకుండా ఇండియా నుంచి ఆస్కార్ కోసం పంపబడిన లిస్ట్ లో ఉంది.ఇక 24 న ఫైనల్ లిస్ట్ విడుదల చేయబోతున్నారట.

అప్పటి వరకు అది ఇప్పుడు పక్కన పెడదాం.అయితే ఏదైనా ఒక అవార్డు ఇచ్చే ముందు వోటింగ్ పద్ధతి ఉపయోంగించుకొని ఒక నిర్ణయానికి వస్తారు.

ఆస్కార్ అవార్డు కోసం అయితే 9000 ల మంది తమ వోటింగ్ ని వినియోగిస్తే, ఎమ్మీస్ లాంటి అవార్డు కోసం అయితే ఏకంగా ఇరవై వేల మంది ఓట్లు వేస్తారు.

Telugu Rajamouli, Ntr, Mm Keeravani, Natu Natu, Oscar Award, Ram Charan, Rrrgold

ఇక ఆరు వేల మంది ఓట్ల తో నిర్ణయించే అవార్డు బ్రిటిష్ అకాడమీ అవార్డు.గోల్డెన్ గ్లోబ్ అవార్డు విషయానికి వస్తే కేవలం 105 ఓట్ల ద్వారానే ఈ అవార్డు నిర్ణయం జరుగుతుంది.మరి ఒక వంద మందిలో ఎవరు ఎక్కువ ఓట్లు వేస్తే నిర్ణయం తీసుకొని మన వారికి అవార్డు ఇస్తే ఎంత విలువ అని మనం జబ్బలు చరుచుకుందాం చెప్పండి.

అది కూడా ఇప్పటి వరకు తెలుగు లో ఏ చిత్రానికి రాలేను కాబట్టి చాల గొప్ప అవార్డు అంటూ అనుకుందామా అంటే ఒకే.

Telugu Rajamouli, Ntr, Mm Keeravani, Natu Natu, Oscar Award, Ram Charan, Rrrgold

ఇలా అతి కొద్దీ ఓట్లతో నిర్ణయం తీసుకోవడం పట్ల గోల్డెన్ గ్లోబ్ వారి ఆలోచన ఏంటో అర్ధం కాలేదు.కేవలం మెరిట్ ఉన్న సినిమాలను మాత్రమే ఎంచుకొని అందులో ఒక దానికి అవార్డు నిర్ణయిస్తే దానికి ఎంత వరకు విలువ ఉంతుంది.మన ఇండియాలో కూడా చాల అవార్డులు ఇస్తున్నారు.

వాటికి కూడా గ్లోబల్ లేదా ఇంటర్నేషనల్ అనే పేరు పెట్టేసి వరల్డ్ వైడ్ గా ఒక అవార్డు అని పేరు మారిస్తే ఎలా ఉంటుందో ఇప్పుడు ఈ అవార్డు కూడా అలాగే ఉంది మరి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube