గాడ్ ఫాదర్ కు హిందీలో ఈ స్థాయిలో క్రేజా.. థియేటర్లలో బాణసంచా పేలుస్తూ?

మోహన్ రాజా, మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్ లో తాజాగా తెరకెక్కిన చిత్రం గాడ్ ఫాదర్.ఇటీవల దసరా పండుగ కానుకగా విడుదలైన ఈ సినిమా మంచి హిట్ టాక్ ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.

 Godfather Salman Khan Fans Burst Firecrackers Theatre Video Viral, God Father Mo-TeluguStop.com

ఇక ఈ సినిమాలో చిరంజీవి, సల్మాన్ ఖాన్, లేడీ సూపర్ స్టార్ నయనతార, నటుడు సత్యదేవ్,దర్శకుడు పూరి జగన్నాథ్ లు ముఖ్యపాత్రల్లో నటించారు.ఈ సినిమాను రామ్ చరణ్,ఆర్ బి చౌదరి కలిసి నిర్మించిన విషయం తెలిసిందే.

మలయాళం లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన లూసిఫర్ సినిమాకు ఈ సినిమా రీమేక్ గా తెరకెక్కిన విషయం అందరికీ తెలిసిందే.ఇటీవల విడుదలైన ఈ సినిమా ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తూ దూసుకుపోతోంది.

ప్రస్తుతం ఈ సినిమా థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితం అవుతోంది.

ఇది ఇలా ఉంటే థియేటర్లలో చిరంజీవి అభిమానులు అలాగే సల్మాన్ ఖాన్ అభిమానుల అత్యుత్సాహం సందడి వేరే లెవల్ అని చెప్పవచ్చు.

థియేటర్లో అరుపులు కేకలతో హోరెత్తిస్తున్నారు అభిమానులు.ఇక సల్మాన్ ఖాన్ అభిమానులు అంతటితో ఊరుకోకుండా థియేటర్లో మరింత అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు.ఇక థియేటర్లో తార్ మార్ అనే పాట స్క్రీన్ మీద ప్లే అవుతున్న సమయంలో కొందరు సల్మాన్ ఖాన్ అభిమానులు థియేటర్లోనే టపాసులు కాల్చారు.దీంతో సినిమా థియేటర్లో సినిమాను చూస్తున్న ప్రేక్షకులు భయంతో అక్కడి నుంచి పరుగులు తీశారు.

టపాసులు కాల్చడంతో ఒక్కసారిగా అక్కడ కొద్దిసేపు తొక్కిసలాట జరిగింది.

అందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవ్వడంతో ఆ వీడియోలను చూసిన నెటిజన్స్ ఇదెక్కడి మాస్ రా మావ అంటూ కామెంట్ చేస్తున్నారు.అయితే అభిమానులు ఆ వీడియో పై పాజిటివ్ గా స్పందిస్తుండగా పలువురు ప్రేక్షకులు మాత్రం నెగిటివ్ గా స్పందించడంతోపాటు ఆ పని చేసిన వారిపై మండిపడుతున్నారు.ఇకపోతే గతంలో కూడా సల్మాన్ ఖాన్ నటించిన అంతిమ్ సినిమా రిలీజ్ సమయంలో అభిమానులు కూడా ఈ విధంగానే థియేటర్లో టపాసులు పేల్చారు.

సమయంలో ఆ విషయం తెలుసుకున్న సల్మాన్ ఖాన్ ఇలా ఎప్పుడు చేయకూడదు అంటూ అభిమానులకు విజ్ఞప్తి చేశాడు.కానీ సల్మాన్ ఖాన్ చెప్పిన విషయాన్ని అభిమానులు ఏ మాత్రం పట్టించుకోకుండా ఈ విధంగా మరొకసారి థియేటర్లో టపాసులు అని కాల్చారు.

మరి ఈ వీడియోలపై సల్మాన్ ఖాన్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మరి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube