ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని భద్రాచలంలో గోదావరి నీటిమట్టం క్రమక్రమంగా పెరుగుతోంది.ప్రస్తుతం భద్రాచలం బ్రిడ్జి వద్ద నీటిమట్టం 43.5 అడుగులకు చేరుకుంది.ఈ నేపథ్యంలో మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది.
కాగా సుమారు 9,55,828 క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువకు విడుదల చేశారు.అయితే ఎగువ ప్రాంతాల నుంచి వరద ప్రవాహం ఎక్కువగా ఉండటంతో గోదావరి నీటిమట్టం పెరుగుతోంది.
ఇప్పటికే అప్రమత్తమైన అధికార యంత్రాంగం నదీ పరివాహక ప్రాంత ప్రజలను అప్రమత్తం చేసిన సంగతి తెలిసిందే.ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు ముందస్తు చర్యల్లో భాగంగా పునరావాస కేంద్రాలతో పాటు హెల్త్ క్యాంపులను అధికారులు ఏర్పాటు చేశారు.