దేశ వ్యాప్తంగా వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఓ కన్నేసినప్పటికీ రోజు రోజుకి ఈ ముఠా దారులు వ్యభిచారాన్ని నిర్వహించేందుకు కొత్త దారులు వెతుక్కుంటున్నారు.తాజాగా కొంతమంది ముఠా సభ్యులు పేదింటి ఆడ పిల్లని టార్గెట్ చేసి వారిని చదివిస్తామని చెప్పి తల్లిదండ్రుల దగ్గర నుంచి తీసుకెళ్లి వారితో ఏకంగా వ్యభిచారం నిర్వహిస్తున్న ఘటన తెలంగాణ రాష్ట్రంలో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళితే స్థానిక రాష్ట్రానికి చెందిన సిరిసిల్ల జిల్లాలో ఓ యువతి తన కుటుంబ సభ్యులతో నివాసముంటోంది.అయితే ఈమె కుటుంబ సభ్యులు కొంతమేర పేదరికాన్ని అనుభవిస్తున్నారు.ఈ విషయం తెలుసుకున్న కొందరు వ్యభిచారం నిర్వహించే ముఠా సభ్యులు యువతి కుటుంబ సభ్యులను సంప్రదించి తాము ఓ చారిటీ ట్రస్టు లో పని చేస్తున్నామని కాబట్టి తమ కూతురిని అప్పగిస్తే బాగా చదివించి ప్రయోజకురాల్ని చేస్తానని నమ్మబలికి అక్కడి నుంచి తీసుకెళ్లి యువతితో వ్యభిచారం చేయించారు.దీంతో ఇతరుల సాయంతో యువతి పోలీసులని ఆశ్రయించి తనను రక్షించాలని కోరింది.
వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు వ్యభిచారం నిర్వహించే ముఠా సభ్యుల పై దాడి చేసి వారిని ప్రత్యక్షంగా పట్టుకున్నారు.అంతేగాక వ్యభిచారం నిర్వహిస్తూ పట్టుబడినటువంటి యువతులను ప్రభుత్వ సంక్షేమాలయానికి తరలించారు.
అయితే ఈ విషయంపై స్పందించిన పోలీసులు ఈ మధ్య కాలంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు పేద కుటుంబాలను టార్గెట్ చేస్తూ తమ పిల్లలను చదివిస్తామనే నెపంతో తీసుకెళ్లి ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని కాబట్టి జాగ్రత్తగా ఉండాలని సూచించారు.అంతేకాకుండా తాము ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో ఎవరైనా అనుమానాస్పదంగా కనిపించినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.