మాస్క్ లో ఉన్న ఈ హీరో ఎవరో గుర్తు పట్టారా...?

ఎలాంటి సినిమా కుటుంబం బ్యాగ్రౌండ్ లేకుండా సినీ పరిశ్రమకు వచ్చి తన స్వశక్తితో అవకాశాలు దక్కించుకొని మొదట్లో చిన్న చిన్న పాత్రలలో నటిస్తూనే స్టార్ హీరో రేంజ్ కి ఎదిగిన టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ విధించడంతో రవితేజ ఇంటి పట్టునే ఉంటూ సోషల్ మీడియా మాధ్యమాలలో బాగానే యాక్టివ్ గా ఉంటున్నాడు.

 Raviteja Wear Mask Viral Photos, Raviteja, Tollywood Hero, Krack Movie News, Tol-TeluguStop.com

ఇందులో భాగంగా ఇటీవలే తన నివాసంలో పెంపుడు కుక్కలతో దిగినటువంటి ఫోటోలను ఇంస్టాగ్రామ్ ద్వారా షేర్ చేశాడు.అయితే ఈ ఫోటోలలో రవితేజ మాస్కు ధరించి దర్శనమిచ్చాడు.అంతేగాక ఈ ఫోటోకి “మై బాయ్స్” అంటూ క్యాప్షన్ కూడా పెట్టాడు.దీంతో ఈ ఫోటోలను షేర్ చేసిన అతి కొద్ది సమయంలోనే 90 వేల పైచిలుకు లైకులు వచ్చాయి.

అంతేగాక కొంతమంది రవితేజ అభిమానులు ఈ ఫోటోలని షేర్ చేస్తూ బాగానే వైరల్ చేస్తున్నారు.

ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం రవితేజ టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న క్రాక్ అనే  చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు.

 ఈ చిత్రంలో రవితేజ కి జోడీగా శృతిహాసన్ నటిస్తుండగా, విలన్ పాత్రలో కోలీవుడ్ బ్యూటీ వరలక్ష్మి శరత్ కుమార్ నటిస్తోంది.కాగా ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన చిత్రీకరణ పనులు పూర్తయి విడుదలకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube