ప్రస్తుత కాలంలో పిల్లల మీద ఉన్న ఇష్టం తో తమకు సంతాన కలిగే యోగ్యం లేకపోయినప్పటికీ కొందరు దంపతులు ఎలాగైనా సరే పిల్లల్ని కనాలని చేయకూడని తప్పులు చేస్తున్నారు.తాజాగా ఓ వ్యక్తి తనకి పిల్లలు పుట్టరని తెలిసి తన పక్కింటి వ్యక్తి ద్వారా తన భార్యని గర్భవతిని చేయాలని ఒప్పందం కుదుర్చుకొని చివరికి ఆ ప్రయత్నం కూడా బెడిసి కొట్టిన ఘటన జర్మనీ దేశంలో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళితే దేశంలోని ఓ ప్రాంతంలో సౌపోలస్ అనే వ్యక్తి తన భార్యతో కలిసి నివాసముంటున్నాడు.అయితే ఇతడికి చిన్నప్పటి నుంచి పిల్లల మీద చాలా ఇష్టం ఉండడంతో తన పెళ్లయినప్పటి నుంచి అన్ని విధాలుగా తన భార్యతో పిల్లల కోసం ప్రయత్నించాడు.
కానీ ఫలితం లేకపోయింది.దీంతో దగ్గరలో ఉన్నటువంటి వైద్యులను సంప్రదించగా ఈ దంపతులకు వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం సౌపోలస్ లో లోపం ఉందని ఇక పిల్లలు పుట్టరని తేల్చేశారు.
దీంతో మొదట్లో సౌపోలస్ కొంతమేర బాధ పడినప్పటికీ తనకి పిల్లలపై ఉన్న ఇష్టం మాత్రం చావలేదు.
దీంతో తన పొరుగింట్లో నివాసముంటున్న ఫ్రాంక్ అనే వ్యక్తి ద్వారా పిల్లల్ని కనాలని పథకం పన్నాడు.
అంతేకాక ఇందుకు గాను ఆ వ్యక్తికి కొంత నగదు మొత్తాన్ని కూడా చెల్లిస్తానని ఒప్పందం చేసుకున్నాడు.అయితే పలుమార్లు సౌపోలస్ భార్య అతడితో శృంగారంలో పాల్గొన్నప్పటికీ గర్భం దాల్చాక పోవడంతో ఫ్రాంక్ కి సంతాన సాఫల్య పరీక్షలు నిర్వహించగా అతడికి కూడా సంతాన భాగ్యం లేదని వైద్యులు తేల్చేశారు.
దీంతో ఒక్కసారిగా ఫ్రాంక్ ఖంగు తిన్నాడు.ఎందుకంటే అప్పటికే ఫ్రాంక్ కి ముగ్గురు పిల్లలు ఉన్నారు.
దీంతో అసలు విషయం ముందే చెప్పకుండా తనని మోసం చేశారంటూ సౌపోలస్ తనకు నష్ట పరిహారం చెల్లించాలని కోర్టులో కేసు వేశాడు.అయితే ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాలలో వైరల్ అవుతోంది.
దాంతో పిల్లల మీద ఉన్న ఇష్టంతో సౌపోలస్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని కొందరు నెటిజన్లు తప్పు పట్టారు.అంతేగాక ఎవరైనా అనాధ పిల్లలను దత్తత తీసుకొని కన్న బిడ్డ లాగా పెంచుకోవడం వల్ల ఇటు తమ కోరిక తీరుతుంది, అలాగే ఇతరులకు మంచి భవిష్యత్తు ఇచ్చిన వారవుతారని సూచిస్తున్నారు.
మరి ఈ నెటిజన్ల సలహాని సౌపోలస్ పాటిస్తే కచ్చితంగా పాటిస్తే ఓ అనాధ బిడ్డకి మంచి జీవితం దొరుకుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.