ఆ మూవీతో సౌత్ ఎంట్రీకి సిద్ధమైన జెనీలియా.. త్వరలోనే ప్రకటన?

దక్షిణాది సినీ ఇండస్ట్రీలో అగ్రనటిగా కొనసాగుతున్న జెనీలియా నా ఇష్టం సినిమా ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమకు గుడ్ బై చెప్పింది.ఈ క్రమంలోనే తెలుగు ఇండస్ట్రీకి దూరమైన జెనీలియా బాలీవుడ్ స్టార్ నటుడు, ప్రొడ్యూసర్ రితేష్ దేశ్ ముఖ్ ను పెళ్లి చేసుకొని పూర్తిగా తన వైవాహిక జీవితంలో స్థిరపడిపోయారు.

 Genelia Ready For South Entry With That Movie Announcement Soon Details, Geneli-TeluguStop.com

ఇలా వివాహం తర్వాత ఇద్దరు పిల్లలకు తల్లిగా మారిన జెనీలియా వారి ఆలనా పాలనా చూసుకుంటూ ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు అయితే ప్రస్తుతం పిల్లలు పెద్ద కావడంతో తిరిగి ఇండస్ట్రీ వైపు అడుగులు వేస్తోంది.

ఈ క్రమంలోనే మరోసారి దక్షిణాది సినీ ప్రేక్షకులను సందడి చేయడానికి ఈ హాసిని మన ముందుకు రాబోతుందని వెల్లడించారు.

ఇక ఈ విషయం జెనీలియా వెల్లడించడంతో అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.ఇకపోతే జెనీలియా ఏ సినిమా ద్వారా ప్రేక్షకులను సందడి చేయబోతుంది అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ క్రమంలోనే కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి తనయుడు కిరీట రెడ్డి హీరోగా ఎంట్రీ ఇస్తున్న సంగతి మనకు తెలిసిందే.ఈ సినిమా పూజా కార్యక్రమాలను లాంఛనంగా ప్రారంభించారు.

కిరీటి రెడ్డి హీరోగా నిర్మిస్తున్న నిర్మాతలకు ఈ సందర్భంగా ఈమె కృతజ్ఞతలు తెలియజేస్తూ దక్షిణాది సినిమా ఇండస్ట్రీని నా రీ ఎంట్రీ కోసం ఎదురుచూస్తోంది.

Telugu Galijanardhan, Genelia, Kireeti Reddy, Reentry, Tollywood-Movie

నా సొంత ఇల్లని భావించే దక్షిణాది సినీ ఇండస్ట్రీకి నేను దూరంగా ఉన్నాను ఈ క్రమంలోనే నా ఇంటికి నన్ను ఆహ్వానిస్తున్న దర్శకుడు సాయికొర్రపాటి రాధాకృష్ణకు ప్రత్యేక ధన్యవాదాలు తెలపడమే కాకుండా డెబ్యూ ఫిల్మ్ ఈ సందర్భంగా కిరీటి రెడ్డికి జెనీలియా శుభాకాంక్షలు తెలుపుతూ మీ సినిమాలో భాగమైనందుకు సంతోషిస్తున్నాను అంటూ ఇన్స్టాగ్రామ్ ద్వారా చెప్పుకొచ్చారు జెనీలియా పోస్ట్ చూస్తే ఈమె కిరీట రెడ్డి చేస్తున్న సినిమాలో హీరోయిన్ గా రీ ఎంట్రీ ఇవ్వనుందని తెలుస్తోంది.అయితే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube