అమ్మాయిలకు గుడ్ న్యూస్.. 'ఫ్రీ'గా స్కూటీ!

ఏంటి నిజామా? ఎక్కడ ఇస్తున్నారు అని అనుకుంటున్నారా.నిజమే కానీ తెలుగురాష్ట్రాల్లో అయితే ఇవ్వటం లేదు.

 Free Scootys,  Inter Girls, Assam, Sebaonline, Electric Scooter, Assam Govt-TeluguStop.com

ఫ్రీగా స్కూటీలను ఇవ్వాలనేది అస్సాం ప్రభుత్వం ఆలోచన.పూర్తి వివరాల్లోకి వెళ్తే.

అస్సాం రాష్ట్రంలోని ఇంటర్మీడియెట్‌ పరీక్షల్లో మొదటి స్థానం దక్కించుకున్న విద్యార్థినులకు ప్రోత్సాహకంగా స్కూటీలను ఇవ్వాలని అస్సాం ప్రభుత్వం నిర్ణయించింది

”ప్రజ్ఞాన్‌ భారతి” పథకం కింద 22 వేలమంది విద్యార్థినులకు ఈ స్కూటీలను ఇవ్వాలని అస్సాం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి హిమాంత బిశ్వ శర్మ ప్రకటించారు.ఇంకా ఈ ఎలక్ట్రిక్‌ స్కూటీ ఒక్కోదాని విలువ రూ.50,000 పైగా ఉండొచ్చని సమాచారం.అయితే ఈ అవకాశం కేవలం అస్సాం రాష్ట్ర సిలబస్ చదివిన వారికి మాత్రమే వర్తిస్తుంది

కాగా ఈ సంవత్సరం ఇంటర్ ఫస్ట్‌ క్లాస్‌లో పాసై, స్కూటీ కావాలనుకునే అస్సాం అమ్మాయిలకు sebaonline.org వెబ్ సైట్ నుంచి దరఖాస్తు చేసుకోవాల్సిందిగా మంత్రి సూచించారు.

ఈ వాహనాల పంపిణి అక్టోబర్ 15వ తేదీలోగా పూర్తి చెయ్యనున్నట్టు అయన చెప్పారు.ఇలా ప్రోత్సాహకంగా ఇచ్చిన స్కూటీని మూడు సంవత్సరాల లోపు విక్రయించకూడదు అని అయన తెలిపారు.

ప్రస్తుతం విధ్యార్థులకు స్కూటీ ఫ్రీ గా ఇవ్వడం అనేది అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube