అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది.ట్రాక్టర్ ను ట్రావెల్ బస్సు ఢీకొన్న ఘటనలో నలుగురు మృత్యువాత పడ్డారు.
మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.గార్లదిన్నె మండలం కల్లూరు వద్ద తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
వెంటనే గమనించిన స్థానికులు బాధితులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రులకు తరలించారు.అయితే వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది.
అనంతరం సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.అలాగే ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అయితే బస్సు డ్రైవర్ నిద్రమత్తే ప్రమాదానికి కారణమని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు.