ఓట్లేసి గెలిపించిన కడప జిల్లా ప్రజలను, రైతులను ఆదుకోవాలన్నారు టిడిపి మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.ఉమ్మడి కడప జిల్లా టిడిపి సమన్వయ కమిటీ సమావేశంలో పాల్గొన్న సోమిరెడ్డి వైసిపి మూడున్నర ఏళ్లలో చేసిన అభివృద్ధి కన్నా తెలుగుదేశం హయాంలోనే ఎక్కువ అభివృద్ధి చేశామని కామెంట్ చేశారు.
నాడు వైఎస్ ఆర్‌కు, నేడు వైఎస్ జగన్‌కు ప్రజలు ఓటేసి పట్టంగట్టినా చేసిన అభివృద్ధి ఏమీ లేదని విమర్శలు చేశారు.కడప ఉక్కు పరిశ్రమ, పులివెందులకు ప్రత్యేకంగా ఇచ్చిన జీవో ప్రకారం మైక్రో ఇరిటేషన్, కొట్టుకుపోయిన అన్నమయ్య, ఫించా ప్రాజెక్టుల విషయంలో వైసిపి ప్రభుత్వం ఏమీ చేసింది లేదన్నారు.
గాలేరు-నగరి కి గత ప్రభుత్వంలో 11 వేల కోట్లు ఖర్చు చేస్తే ఈ ప్రభుత్వంలో ఖర్చు చేసిందని సోమిరెడ్డి గుర్తు చేశారు.సొంత జిల్లాకు ఏమీ చేయలేని వైఎస్ జగన్ రాష్ట్రానికి ఏ విధంగా మేలు చేస్తారని ఆయన విమర్శలు గుప్పించారు.