క్యాప్సికం లో ఈ మెళుకువలు పాటిస్తే ఏడాది పొడవున ఆదాయమే..!

Follow These Methods For Profitable Capsicum Cultivation Details, Capsicum , Capsicum Cultivation, Capsicum Farmers, Capsicum Yielding, Capsicum Soil, Fertile Soils, Bangalore Mirchi, Pests, Drip Irrigation

క్యాప్సికం పంటను( Capsicum Crop ) కొన్ని మెళుకువలు పాటించి సాగు చేస్తే ఏడాది పొడవునా మంచి ఆదాయం పొందవచ్చు.ఈ క్యాప్సికం ను వివిధ ప్రాంతాలలో వివిధ పేర్లతో పిలుస్తారు.

 Follow These Methods For Profitable Capsicum Cultivation Details, Capsicum , C-TeluguStop.com

బెంగళూరు మిర్చి, సిమ్లా మిర్చి, కూర మిరప, బెల్ పెప్పర్ పేర్లతో పిలుస్తారు.క్యాప్సికం ఆకుపచ్చ, ఎరుపు, నారింజ, పసుపు రంగులలో ఉంటుంది.

ఈ క్యాప్సికం ను పాలీహౌస్ లో పండించడం వల్ల కాయలన్నీ ఒకే సైజులో ఒకే రంగులో ఉంటాయి.ఇలా పండించడం వల్ల చీడపీడల బెడద( Pests ) తక్కువగా ఉండి, ఆరు నెలల వరకు పంట దిగుబడి ఉంటుంది.

ఒక హెక్టార్ పొలంలో దాదాపుగా 300 క్వింటాళ్ల క్యాప్సికం పంటను ఉత్పత్తి చేయవచ్చు.పంట విత్తిన 75 రోజుల తర్వాత దిగుబడి రావడం ప్రారంభం అవుతుంది.వెంటిలేటెడ్ హౌస్ లో క్యాప్సికం పంటను సాగు చేస్తే పది నెలల వరకు దిగుబడి పొందే అవకాశం ఉంటుంది.

క్యాప్సికం పంటకు బరువైన సారవంతమైన నేలలు( Fertile Soil ) చాలా అనుకూలంగా ఉంటాయి.మొక్కలను కాస్త దూరంగా ఉండేటట్లు నాటుకుంటే గాలి, సూర్యరశ్మి బాగా తగిలి మొక్క ఆరోగ్యంగా పెరుగుతుంది.పంట విత్తిన 15 రోజుల తర్వాత ఏపుగా పెరగని మొక్కలను తీసేసి వాటి స్థానంలో బాగా పెరిగే మొక్కలను నాటుకుంటే దిగుబడి పెరగడానికి అవకాశం ఉంటుంది.

పంట పొలంలో తెగుళ్లను గుర్తించిన వెంటనే తెగుళ్లు సోకిన మొక్కలను పొలం నుండి తొలగించాలి.ఇలా చేస్తే ఇతర మొక్కలకు తెగుళ్లు సోకే అవకాశం ఉండదు.క్యాప్సికం పంటను బిందు పద్ధతిలో సాగు చేస్తే మేలైన ఫలితాలు పొందవచ్చు.ఈ పద్ధతిలో నీరు చాలావరకు ఆదా అవుతుంది.మరీ ముఖ్యంగా కలుపు సమస్య తీవ్రత తక్కువగా ఉంటుంది.సేంద్రియ ఎరువులకు అధిక ప్రాధాన్యం ఇస్తే తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి పొందవచ్చు.

Video : క్యాప్సికం లో ఈ మెళుకువలు పాటిస్తే ఏడాది పొడవున ఆదాయమే #TeluguStopVideo

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube