పూరి జగన్నాథుడిని ఏకదంతుడి రూపంలో పూజించే సాంప్రదాయాన్ని ఏమని పిలుస్తారో తెలుసా..?

ముఖ్యంగా చెప్పాలంటే వైష్ణవ దేవాలయాలలో విష్ణుమూర్తి( Vishnumurthy in Vaishnava temples ) ఆయన అవతారాల ఉత్సవ విగ్రహాలను వివిధ వాహనాలపై ఊరేగిస్తూ ఉంటారు.వీటిలో గజవాహన సేవ ఒకటి అని దాదాపు చాలామందికి తెలుసు.

 Do You Know What The Tradition Of Worshiping Lord Jagannath In The Form Of A Sin-TeluguStop.com

అయితే మన భారతదేశంలో ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రాలలో ఒకటైన పూరి పుణ్యక్షేత్రంలో మాత్రం జగన్నాథుడిని, ఆయన అన్నా బలబద్రుడిని ఏకదంతుడి రూపంలోనే ముస్తాబు చేస్తారు.ఈ వేడుకనే ఏనుగు వేషం అని కూడా అంటారు.

ఆషాడశుద్ధ విదియరోజు ప్రారంభమయ్యే ప్రపంచ ప్రసిద్ధ జగన్నాథ రథయాత్రకు ముందే జేష్ఠ పౌర్ణమి రోజు ఈ వేడుక జరుగుతుంది.

Telugu Bhakti, Devotional, Lord Jagannath, Tooth-Latest News - Telugu

పూర్వం రోజులలో పూరి రాజు దగ్గరికి గణపతి బప్ప అనే గొప్ప పండితుడు వచ్చాడు.ఆ సమయంలో పూరిలో జగన్నాథుడిని స్నాన యాత్ర వేడుకకు సిద్ధం చేస్తున్నారు.ఆ వేడుకకు హాజర అవ్వాలని గణపతి బట్టను రాజు ఆహ్వానిస్తాడు.

దానికి ఆయన నేను గణపతిని మాత్రమే ఆరాధిస్తానని వేడుకకు రాలేనని చెబుతాడు.రాజు బలవంత పెట్టేసరికి అన్యమనస్కంగానే జగన్నాధుడి స్నాన యాత్రకు గణపతి బప్ప వెళ్తాడు.

అయితే అక్కడికి వెళ్లేసరికి అద్భుతం జరుగుతుంది.జగన్నాథుడి రూపంలో ఉన్న కృష్ణుడు గణపతి భట్టకు గణేశుడి రూపంలో కనిపిస్తాడు.

Telugu Bhakti, Devotional, Lord Jagannath, Tooth-Latest News - Telugu

అంతేకాకుండా బలబద్రుడు( balabadrudu ) కూడా ఏకదంతుడి రూపంలోనే కనిపిస్తాడు.దానితో బలబద్రుడు, జగన్నాధులు సాక్షాత్తు శివ కేశవులనే అన్న సంగతి గణపతి బప్ప తెలుసుకుంటాడు.అలా తనకు కళ్ళు తెరిపించడానికి వాళ్ళిద్దరూ గణపతి రూపాన్ని ధరించారని ఆయనకు అర్థమవుతుంది.అంతేకాకుండా గణపతి, విష్ణువు, శివుడు, గౌరీ ఇలా బేధాలు ఎన్ని ఉన్నా పరమాత్ముడు ఒక్కడే అని గుర్తిస్తాడు.

అప్పటి నుంచి రథయాత్రకు ముందు జేష్ట పౌర్ణమి రోజు జరిపే స్నాన యాత్ర సమయంలో జగన్నాధ దేవాలయ పూజరులు జగన్నాథ, బలభద్రుల ముఖాలకు ఏనుగు తొడుగులు ధరింపజేస్తారు.బలరాముడు తెల్ల ఏనుగు రూపంలో, జగన్నాథుడు నల్ల ఏనుగు రూపంలో దర్శనం ఇచ్చే సందర్భాన్ని పూరి దేవాలయా సంప్రదాయంలో హాథిబేష అని అంటారు.

గణపతి రూపంలో భగవంతుని దర్శిస్తే మంచి జరుగుతుందని చాలామంది భక్తులు నమ్ముతారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube