ఆండ్రాయిడ్ యూజర్లకు శుభవార్త.. కొత్త అప్డేట్‌లో అదిరిపోయే ఫీచర్లు

ప్రపంచంలో ఎక్కువమంది ఆండ్రాయిడ్( Android ) ఫోన్లనే ఉపయోగిస్తున్నారు.ఆండ్రాయిడ్ ఫోన్లలో అనేక ఫీచర్లు ఉండటంతో పాటు ఉపయోగించడానికి కూడా సులువుగా ఉంటుంది.

 Good News For Android Users The New Update Has Amazing Features, Android Users,-TeluguStop.com

అలాగే అన్నీ యాప్‌లను అత్యంత సులువుగా వాడుకోవచ్చు.ఐఫోన్లలో మాత్రమే ఐఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది.

ఇక మిగతా ఫోన్లన్నింటిలోనూ ఆండ్రాయిస్ ఓఎస్ కామన్‌గా ఉంటుంది.ఆండ్రాయిడ్‌లో ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లను అప్డేట్ చేస్తూ ఉంటారు.

అందులో భాగంగా తాజాగా మరో స్టన్నింగ్ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది.

Telugu Android, Os, Tech-Technology Telugu

ఐఫోన్లలో బ్యాటరీ హెల్త్ ఫీచర్ ( Battery Health feature )అందుబాటులోకి ఉంటుంది.ఇక ఈ ఫీచర్ త్వరలో ఆండ్రాయిడ్ ఫోన్లలోనూ రానుంది.ఆండ్రాయిడ్ 14 అప్‌డేట్ లో ఈ కొత్త ఫీచర్ రానుందని తెలుస్తోంది.

ఈ విషయాన్ని ఆండ్రాయిడ్ రీసెర్చర్ మిసల్ రెహ్మాన్ ( Misal Rahman )తన ట్విట్టర్ అకౌంట్‌లో స్పష్టం చేశారు.ఈ ఫీచర్ ద్వారా బ్యాటరీ సైకిల్ కౌంట్, ఛార్జింగ్ స్టేటస్, బ్యాటరీ హెల్త్ వంటివి తెలుసుకోవచ్చని ట్విట్టర్ అకౌంట్‌లో పేర్కొన్నారు.

అయితే ప్రస్తుతం గూగుల్ పిక్సల్ స్మార్ట్‌ఫోన్లలో మాత్రమే ఈ ఫీచర్ అప్డేట్ చేసిన ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఉంది.త్వరలోనే అన్ని ఫోన్లలోనూ ఆండ్రాయిడ్ 14 బీటా వెర్షన్ అందుబాటులోకి రానుంది.

Telugu Android, Os, Tech-Technology Telugu

2023 ఫిబ్రవరిలో గూగుల్ ఆండ్రాయిడ్ 14 వెర్షన్‌ను( Android 14 version ) విడుదల చేసింది.పూర్తిస్థాయి వెర్షన్‌ను ఈ ఏడాది ఆగస్టులో విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.అయితే 2018లోనే యాపిల్ ఐఓఎస్ 11.3 వెర్షన్‌లో బ్యాటరీ హెల్త్ ఫీచర్‌ను ప్రవేశపెట్టింది.దీంతో ఈ ఫీచర్ ఆకట్టుకోవడంతో ఆండ్రాయిడ్ ఫోన్లలోనూ తీసుకురావాలని నిర్ణయించారు.ఈ ఫీచర్ ద్వారా బ్యాటరీ స్థితి, పనితీరును పరిశీలించవచ్చు.ఇలాంటికి కొన్ని యాప్‌లు వచ్చినా.అవి అంతగా ఖచ్చితత్వాన్ని అందించడం లేదు.

దీంతో ఆండ్రాయిడ్ తీసుకురానున్న ఫీచర్‌లో ఖచ్చితమైన బ్యాటరీ స్థితిని ట్రాక్ చేయవచ్చని చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube