దృశ్యం 3 సినిమా స్టోరీ లైన్ ఇదే.. ఆ కేసు కొట్టేయడమే లక్ష్యంగా ఆ పని?

కొన్ని సినిమాలు సీక్వెల్స్ లో కొత్త కొత్త కాన్సెప్ట్ తో కానీ లేదా మొదటి సినిమాతో వచ్చిన స్టోరీని కంటిన్యూ చేస్తుంటారు.అలా సీక్వెల్స్ తో వచ్చిన సినిమాలను ప్రేక్షకులు చూడటానికి ఇష్టపడతారు.

 Venkatesh Meena Drushyam Movie Sequel Part 3 Story Line Viral On Social Media De-TeluguStop.com

మొదటి కథలో చివరిలో ఏదైనా ట్విస్ట్ ఉంటే అది అక్కడికే ముగింపు పలక పోగా దానిని సీక్వెల్స్ కథలో సాగదీస్తూ అక్కడ ముగింపు ఇస్తారు.సెకండ్ సీక్వెల్స్ లో కూడా ముగింపు ఇవ్వకపోతే థర్డ్ సీక్వెల్స్ లో అయినా ఆ ట్విస్ట్ ను బయట పెట్టే ప్రయత్నం చేస్తారు.

అలా ట్విస్ట్ కోసం ప్రేక్షకులు ఖచ్చితంగా సీక్వెల్స్ సినిమా చూడటానికి ఇష్టపడతారు.

అలా ఇప్పటికీ చాలా సినిమాలు తెరకెక్కాయి.

అందులో బాహుబలి, ఎఫ్2, దృశ్యం వంటి పలు సినిమాలు ఉండగా పుష్ప 2 కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది.ఇక ఈ సినిమాలలో కొన్ని కథలు మొదటి కథతో సాగగా మరికొన్ని రెండవ కథలో కాస్త మార్చి చూపించారు.

ఇదంతా పక్కన పెడితే త్వరలో దృశ్యం 3 కూడా రానుంది.

ఇప్పటికే దృశ్యం సినిమా రెండు కథలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.

శ్రీ ప్రియ, జీతు జోసెఫ్ దర్శకత్వంలో దృశ్యం పార్ట్ 1, పార్ట్ 2 విడుదలైన సంగతి తెలిసిందే.ఇందులో వెంకటేష్, మీనా, నదియా, నరేష్ కీలక పాత్రలో నటించారు.

ఇక ఈ సినిమా మొదటి భాగంలో నదియా కొడుకును వెంకటేష్ చంపి పోలీస్ స్టేషన్ కింద పాతిపెట్టిన సంగతి తెలిసిందే.

Telugu Baahubali, Jeetu Joseph, Drushyam, Drushyamstory, Meena, Priya, Nadia, Na

దాంతో మొదటి కథలో వెంకటేష్ నిజం చెప్పకుండా ఉంటాడు.ఇక రెండవ కథలో వెంకటేష్ నుండి నిజం బయటికి రావడానికి పోలీసులు ఎంత ప్రయత్నించినా కూడా రెండవ కథలో కూడా వెంకటేష్ బయటపడడు.ఇక మూడవ కథ ఉంటుంది అని గతంలో తెలియగా తాజాగా ఈ కథకు సంబంధించిన ఒక లైన్ బయటపడింది.

మూడవ కథలో కూడా వెంకటేష్ నుంచి నిజం బయటికి రప్పించే ప్రయత్నం చేస్తారు అని కానీ ఇందులో కూడా వెంకటేష్ నిజం చెప్పడు అని దీంతో పూర్తిగా కేసు కొట్టివేస్తారు అని తెలిసింది.కారణం ఏంటంటే ఇందులో వెంకటేష్ బీజేపీ పార్టీలో చేరి రాజకీయ నాయకుడిగా మారడంతో ఆయనకు రాజకీయ సపోర్ట్ ఉండటం వల్ల ఆయన మీద ఉన్న కేసు కొట్టివేస్తారు అని తెలిసింది.

Telugu Baahubali, Jeetu Joseph, Drushyam, Drushyamstory, Meena, Priya, Nadia, Na

ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ.ప్రస్తుతం ఈ స్టోరీ లైన్ మాత్రం బాగా వైరల్ అవుతుంది.ఒకవేళ ఇదే లైన్లో సినిమా వచ్చినట్లయితే ఇక ఎప్పటికీ ఆ కేసు ఒక మిస్టరీగానే మిగిలిపోతుంది.మొత్తానికి వెంకటేష్ చేసిన హత్య కేసు ను మూడవ భాగంలో కూడా డైరెక్టర్ బయట పడకుండా రాజకీయాన్ని అడ్డుగా పెట్టినట్లు తెలుస్తుంది.

దీంతో చివరికి పోలీసులు కూడా ఆ కేసును పట్టించుకోకుండా ఉంటారు అని తెలుస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube