తెలుగు రాష్ట్ర సమితిగా ఏపీ లోకి టీఆర్ఎస్ ?    

తెలంగాణ అధికార పార్టీ టిఆర్ఎస్ పార్టీ ఇప్పుడు తెలంగాణలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఆందోళనతో ఉంది.తెలంగాణలో అనూహ్యంగా బిజెపి బలం పెంచుకోవడం టిఆర్ఎస్ కు ఇబ్బందికరంగా మారింది.

 Trs Trying To Enter Ap Politics As Telugu Rashtra Samithi , Kcr,ktr, Telangana,-TeluguStop.com

దీంతో తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో యాక్టివ్ కావాలి అనే ఉద్దేశం ను సైతం పక్కన పెట్టి పూర్తిగా తెలంగాణపై ఫోకస్ పెంచారు.ఎప్పుడూ లేని విధంగా ప్రజల నుంచి తమ ప్రభుత్వంపై వ్యతిరేకత పెరగకుండా అన్ని రకాల మార్గాలను అన్వేషించే పనిలో టిఆర్ఎస్ నేతలంతా నిమగ్నమయ్యారు.

ఇదిలా ఉంటే ఇప్పుడు అదే టిఆర్ఎస్ పార్టీ ఏపీ లోను అడుగుపెట్టబోతోంది అని , ఇక్కడ యాక్టివ్ గా రాజకీయాలు చేయబోతుంది అనే వార్త ఇప్పుడు పెద్ద ఎత్తున రెండు తెలుగు రాష్ట్రాల్లో వైరల్ అవుతోంది.

తెలంగాణ రాష్ట్ర సమితి కాస్త ఏపీలో తెలుగు రాష్ట్ర సమితి గా పేరు మార్చుకోబోతోందనే ప్రచారం ఇప్పుడు ఊపందుకుంది.

టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తెలంగాణ మంత్రి కేటీఆర్ విశాఖ ఉక్కు ఉద్యమంలో పాల్గొంటామని, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా అవసరమైతే విశాఖకు వచ్చి పోరాటం చేస్తామనే  ఈ తరహా వార్తలు తెలంగాణలో అధికమయ్యాయి.అసలు టిఆర్ఎస్ ఏపీ లో అడుగు పెట్టబోతోంది అనే వార్త ఇప్పటిది కాదు.

ఎప్పటి నుంచో ఈ తరహా వార్తలు వస్తూనే ఉన్నాయి.టీఆర్ఎస్ మొదటిసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ వార్తలు వచ్చాయి.

దీనికి తగ్గట్టుగానే ఏపీ ప్రజల్లో టిఆర్ఎస్ ప్రభుత్వం పై ఆకర్షణ ఉండేది.ఏపీలో టిఆర్ఎస్ కనుక అప్పట్లో అడుగు పెడితే మంచి ఆదరణ లభించింది ఉండేదనే ప్రచారం అప్పట్లో జరిగింది.

Telugu Ap, Jagan, Steel, Telangana, Telugurashtra, Trs, Visakha Steel, Vizag, Vi

అయితే ఇప్పుడు తెలుగు రాష్ట్ర సమితి పేరుతో టిఆర్ఎస్ ఏపీ లో అడుగు పెట్టబోతోంది అని, విశాఖ ఉద్యమం ద్వారా దీనికి నాంది పలుకుతోందని పొలిటికల్ గాసిప్స్ తీవ్రతరం అయ్యాయి.అయితే ప్రస్తుతం తెలంగాణలో టిఆర్ఎస్ ఎదుర్కొంటున్న ఇబ్బందుల నేపథ్యంలో ఏపీ లో అడుగుపెట్టే సాహసం టిఆర్ఎస్ చేస్తుందా, అదీకాకుండా ఏపీ అధికార పార్టీగా వైసీపీ ఉండడం, మొదటి నుంచి జగన్ తో కేసీఆర్ సన్నిహితంగా మెలుగతూ ఉండడం వంటి వ్యవహారాలు చూస్తుంటే టిఆర్ఎస్ ఇక్కడ అడుగుపెట్టే అవకాశాలు తక్కువగానే కనిపిస్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube