పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చేస్తున్న లేటెస్ట్ సినిమా ఆదిపురుష్.ఈ సినిమా ఎప్పుడో షూటింగ్ కూడా పూర్తి చేసుకుని రిలీజ్ కు రెడీ అయ్యింది.
బాహుబలి తర్వాత ప్రభాస్ నిరాశ పరచడంతో ఇప్పుడు ఈ సినిమా పైనే అందరి ద్రుష్టి పడింది.ప్రెసెంట్ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపు కుంటున్న ఈ సినిమా ఇటీవలే టీజర్ వచ్చింది.
ఈ టీజర్ తర్వాత ఈ సినిమా చాలానే ట్రోల్స్ వచ్చిన అభిమానించే ప్రేక్షకులు కూడా అదే రేంజ్ లో ఉన్నారు.
రామాయణం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాను బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కించారు.
ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా నటిస్తుంటే.సీతగా కృతి సనన్ నటిస్తుంది.
లంకేశ్వరుడు రావణాసురిడిగా సైఫ్ అలీ ఖాన్ నటిస్తుండగా.లక్ష్మణ్ గా సన్నీ సింగ్ నటిస్తున్నాడు.
ఆదిపురుష్ సినిమాను టి సిరీస్ సంస్థ 500 కోట్ల భారీ ఖర్చుతో నిర్మించారు.ఇక తాజాగా ఈ సినిమా నుండి మరొక అప్డేట్ బయటకు వచ్చింది.
ఇటీవలే 3డి వర్షన్ లో టీజర్ రిలీజ్ చేసిన తర్వాత మరిన్ని అంచనాలు పెరిగి పోయాయి.ఇక ఇదిలా ఉండగా ఇప్పుడు ఈ సినిమా నుండి మరొక బ్లాస్టింగ్ అప్డేట్ ఇవ్వబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి.
మరి ఈ నెలలోనే డార్లింగ్ పుట్టిన రోజు ఉన్న విషయం తెలిసిందే.మరి అక్టోబర్ 23న జరుపుకో బోతున్న ఈ పుట్టిన రోజుకు ప్రభాస్ నటిస్తున్న సినిమాల నుండి వరుస అప్డేట్ లు వచ్చే అవకాశం ఉంది.
మరి ఆదిపురుష్ నుండి కూడా ఒక అప్డేట్ ను రెడీ చేస్తున్నట్టు సమాచారం.

మొన్నటి టీజర్ లాగానే మరో టీజర్ రెడీ చేసి డార్లింగ్ పుట్టిన రోజు నాడు రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టు టాక్ వస్తుంది.మరి ఈసారి ఏ ఒక్క అభిమానిని కూడా నిరాశ పరచకుండా ఉంటారని తెలుస్తుంది.చూడాలి ఆ అప్డేట్ ఎంత బ్లాస్టింగ్ గా ఉంటుందో.
ఇక ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12, 2023న రిలీజ్ కానుంది.







