ఎమ్మెల్సీ అనంతబాబుకు ఏపీ హైకోర్టులో మరోసారి చుక్కెదురైంది.అనంతబాబు బెయిల్ కావాలంటూ దాఖలు చేసిన పిటిషన్ ను న్యాయస్థానం డిస్మిస్ చేసింది.
బాధితుల తరపు న్యాయవాది వాదనలతో ఏకీభవించిన హైకోర్టు.పిటిషన్ ను తిరస్కరించింది.
అయితే మాజీ డ్రైవర్ హత్య కేసులో అనంతబాబు మే 23వ తేదీ నుంచి రాజమండ్రి జైలులో ఉన్న సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలోనే తన తల్లి చనిపోవడంతో అంత్యక్రియలకు బెయిల్ పై బయటకు వచ్చిన అనంతబాబు.
బెయిల్ కావాలంటూ హైకోర్టును ఆశ్రయించారు.







