రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్.. పీఎం కిసాన్ అప్డేట్ గురించి కొత్త నెంబర్..

కేంద్ర ప్రభుత్వం మన దేశ రైతుల కోసం ఎన్నో మంచి మంచి పథకాలను ప్రవేశపెడుతూ ఉంటుంది.రైతులకు ఎన్నో పెట్టుబడి పథకాల ద్వారా లాభాలు చేకూర్చే విధంగా పథకాలను ప్రవేశపెడుతుంది కేంద్ర ప్రభుత్వం.

 Central Government Good News For Farmers New Number About Pm Kisan Update , Pm-TeluguStop.com

మోడీ ప్రభుత్వం రైతుల కోసం ప్రవేశపెట్టిన ఎన్నో పథకాలలో పీఎం కిసాన్ ముఖ్యమైనది.పీఎం కిసాన్ పథకం ద్వారా రైతులందరికీ ప్రతి సంవత్సరం 6000 రూపాయలు మూడు విడతలుగా రైతుల ఖాతాలలో జమ అవుతున్నాయి.

రైతులు పీఎం కిసాన్ ద్వారా ఇప్పటివరకు 11 విడతలుగా 2000 రూపాయలు ప్రతి విడతకు తీసుకుంటున్నారు.ఈనెల చివరి కల్లా 12వ విడత డబ్బులు కూడా రైతుల బ్యాంకు అకౌంట్లో కి వస్తాయి.

ఈ పీఎం కిసాన్ గురించి వివరాలు తెలుసుకోవడానికి రైతులకు కేంద్ర ప్రభుత్వం టోల్ ఫ్రీ నెంబర్లను ఏర్పాటు చేసింది.కొత్తగా పీఎం కిసాన్ పథకం కొరకు దరఖాస్తు చేసుకున్న రైతుల కోసం కూడా ఒక కొత్త నెంబర్ను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

155261 నెంబర్ కు కాల్ చేయడం ద్వారా పీఎం కిసాన్ పథకం కొరకు దరఖాస్తు చేసుకున్న రైతు, తన దరఖాస్తు గురించి పూర్తి వివరణ తెలుసుకోవచ్చు.కేంద్ర ప్రభుత్వం వెబ్సైట్ ద్వారా కూడా పీఎం కిసాన్ గురించి రైతులు తెలుసుకోవచ్చు.

వెబ్సైట్లో ఆధార్ నెంబర్ ను కానీ, బ్యాంక్ అకౌంట్ నెంబర్ ను కాని దానికి తగ్గట్లు ఉన్న ఆప్షన్లలో ఎంటర్ చేసి చూస్తే రైతులు ఆ పథకానికి అర్హులో కాదో తెలుసుకోవచ్చు.కానీ కొంతమంది రైతులకు కంప్యూటర్, వెబ్ సైట్ పరిజ్ఞానం ఉండదు కాబట్టి ఈ విషయం గురించి తెలిసిన వారికి చెప్పి పీఎం కిసాన్ గురించి సరైన వివరాలు తెలుసుకోవాలి.

లేదంటే మీ సేవలోకి వెళ్లి రైతులు ఆధార్ కార్డు చూపిస్తే ఆ రైతుకి పిఎం కిసాన్ పథకం వస్తుందో లేదో వివరణ ఇస్తారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube