బాలీవుడ్ భామ సోనాక్షి సిన్హా టాలీవుడ్ మేకర్స్ కి షాక్ ఇచ్చింది.ప్రస్తుతం బాలీవుడ్ హీరోయిన్స్ అంతా సౌత్ సినిమాల మీద ఆసక్తి చూపిస్తున్నారు.
ముఖ్యంగా తెలుగు సినిమాల మీద వాళ్లి స్పెషల్ ఇంట్రెస్ట్ ఉంది.అందుకే మన స్టార్స్ అక్కడ హీరోయిన్స్ కే ముందు ప్రిఫర్ చేస్తున్నారు.
ఈ క్రమంలో నందమూరి బాలకృష్ణ నెక్స్ట్ చేయబోయే సినిమాకు కూడా బాలీవుడ్ అందాల భామ సోనాక్షిని తీసుకోవాలని అనుకున్నారు.అనీల్ రావిపుడి డైరక్షన్ లో రాబోతున్న బాలయ్య 108వ సినిమాకు ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది.
ఇక ఈ మూవీలో హీరోయిన్ గా సోనాక్షి సిన్హాని తీసుకోవాలని అనుకున్నారు.అయితే బాలకృష్ణ పక్కన సోనాక్షి నటించడానికి ఓకే చెప్పింది కానీ రెమ్యునరేషన్ మాత్రం భారీగా డిమాండ్ చేసిందని తెలుస్తుంది.
ఇంతకీ అమ్మడు ఎంత అడిగింది అంటే దాదాపు 6 కోట్ల దాకా అడిగేసిందట.బాలీవుడ్ లో పెద్దగా అవకాశాలు కూడా లేని సోనాక్షి సౌత్ సినిమా అనే సరికి రెమ్యునరేషన్ చుక్కలు చూపిస్తుంది.
అయితే అమ్మడు చెప్పిన ఫిగర్ కు మైండ్ బ్లాక్ అయ్యి నిర్మాతలు వెనక్కి వచ్చారట. మరి సోనాక్షి ప్లేస్ లో ఏ హీరో ఈ మూవీలో నటిస్తుందో తెలియాల్సి ఉంది.







