యంగ్ హీరో రాజ్ తరుణ్ కెరీర్ ప్రారంభంలో వరుస హిట్‌లతో దూసుకుపోయి తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నాడు.ఫుల్ ఫాంలో ఉన్న హీరో వరుసగా వచ్చిన అవకాశాలను వినియోగించుకునే ప్రయత్నంలో కొన్ని తప్పటడగులు వేయడంతో వరుసగా ఫెయిల్యూర్ చిత్రాలు ఎదురయ్యాయి.
ఇక అప్పటినుండి ఒక్క హిట్ కోసం నానా తంటాలు పడుతున్నాడు ఈ హీరో.రాజ్ తరుణ్ ఎంచుకునే కథలు బాగుంటున్నా, ప్రేక్షకులు మాత్రం వాటిని ఆదరించలేకపోతున్నారు.
దీంతో ఈ హీరో ఎలాగైనా ఒక్క హిట్ కొట్టి తిరిగి సక్సెస్ ట్రాక్ ఎక్కాలని చూస్తున్నాడు.
కాగా తాజాగా అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై ఓ సినిమా చేసేందుకు రెడీ అయ్యాడు ఈ హీరో.
రాజ్ తరుణ్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఇంట్రెస్టింగ్ టైటిల్‌ను ఫిక్స్ చేశారట చిత్ర యూనిట్.ఈ సినిమాకు ‘అనుభవించు రాజా’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారట చిత్ర యూనిట్.
ఈ సినిమాకు ఇదైతే యాప్ట్ టైటిల్ అవుతుందని చిత్ర యూనిట్ భావిస్తోందట.ఈ సినిమా ఆద్యంతం కామెడీ ఎంటర్‌టైనర్‌గా రానుండటంతో ఈ సినిమాలో రాజ్ తరుణ్ పాత్ర ఎలా ఉండబోతుందో మనం ఊహించగలం.
ఈ సినిమాను శ్రీనివాస్ గవిరెడ్డి డైరెక్ట్ చేస్తుండగా, కొత్తమ్మాయి కశిష్ ఖాన్ ఈ సినిమాలో హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తోంది.
ఇప్పటికే షూటింగ్ చివరిదశకు చేరుకున్న ఈ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేసి రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.
మరి ఈ సినిమాతోనైనా రాజ్ తరుణ్ హిట్ కొడతాడా లేడా అనేది ఈ సినిమా రిలీజ్ తరువాతే తెలుస్తోంది.అయితే ఈ సినిమాపై మాత్రం రాజ్ తరుణ్ పూర్తి కాన్ఫిడెంట్‌గా ఉన్నాడట.
ఈ సినిమా సబ్జెక్ట్ అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందని ఆయన నమ్ముతున్నాడు.చూద్దాం అనుభవించు రాజా చిత్రం రాజ్ తరుణ్‌కు ఎలాంటి అనుభవాన్ని మిగిలిస్తుందో.







