అట్టర్ ఫ్లాప్ అయిన సినిమాలకు కూడా సీక్వెల్స్.. అవేంటంటే..??

ఆర్య, హిట్, కిక్ 2, ఎఫ్ 2, కార్తికేయ, డీజే టిల్లు, గూడచారి, బాహుబలి వంటి తెలుగు సినిమాలకు సీక్వెల్స్ వచ్చి సూపర్ డూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే.అయితే పార్ట్ 1 హిట్టైతే పార్ట్-2 కూడా తీసి హిట్ కొట్టాలని చాలామంది దర్శకులు భావిస్తున్నారు.

 Flop Movies Sequels Kabzaa Michael Ice Cream Das Ka Dhamki Details, Flop Movies-TeluguStop.com

బాహుబలి, పుష్ప 2, సలార్ లాంటి పెద్ద సినిమాలు ఇన్ కంప్లీట్‌గా ఉండటం వల్ల వాటికి సీక్వెల్స్ అవసరమయ్యాయి.కానీ కొంతమంది దర్శకులు అవసరం లేకపోయినా సీక్వెల్స్ తీసేసి ప్రజల మీద రుదేస్తున్నారు.

ఉదాహరణకి చంద్రముఖి 2( Chandramukhi 2 ) తీసి ఆ మూవీ ఫ్యాన్స్‌కు చాలా నిరాశ మిగిల్చారు.

హిట్టైన సినిమాలకి సీక్వెల్ తీసినా ఒక అందం కానీ హిట్ కాని సినిమాలకు కూడా కొంతమంది సీక్వెల్స్‌ తీస్తూ అందరి సమయాన్ని వృథా చేస్తున్నారు.

కబ్జా సినిమా (2023)( Kabzaa ) ఫెయిల్ అయిన సంగతి తెలిసిందే.అయినా కూడా కబ్జా 2 సినిమా పట్టాలెక్కించి అందరికీ షాక్ ఇచ్చారు.ఈ మూవీని రూ.120 కోట్లు పెట్టి తీస్తే రూ.34 కోట్లు మాత్రమే వచ్చాయి.అంత నష్టపోయినా దీనికి సీక్వెల్ తీయాలని మేకర్స్ నిర్ణయించడం నిజంగా సాహసమే అని చెప్పాలి.

ఆర్.చంద్రు దర్శకత్వం వహించిన ఈ పీరియడ్ యాక్షన్ సినిమాలో ఉపేంద్ర, శివ రాజ్‌కుమార్, కిచ్చా సుదీప, శ్రియ శరణ్, వంటి వాళ్లు నటించారు.

Telugu Chandramukhi, Das Ka Dhamki, Flop, Flop Sequels, Cream, Kabzaa, Michael,

2023లో విడుదలైన నియో-నోయిర్ యాక్షన్ థ్రిల్లర్ “మైఖేల్ ” ( Michael ) కూడా డిజాస్టర్ అయ్యింది.బాక్సాఫీస్ వద్ద కేవలం 11 కోట్లు వసూలు చేసింది.అయినా దీనికి పార్ట్ 2 అనౌన్స్ చేసి ఆశ్చర్యపరిచారు.రవితేజ, స్నేహ నటించిన వెంకీ సినిమాకి( Venky Movie ) కూడా సీక్వెల్ చేయబోతున్నారు.వాస్తవానికి వెంకీ సినిమా సూపర్ హిట్ అయింది.అందులోని కామెడీ ఎవర్ గ్రీన్ హిట్ అని చెప్పుకోవచ్చు.

ఇంత మంచి మూవీ కి సీక్వెల్ చేయాలంటే చాలానే జాగ్రత్తలు తీసుకోవాలి.ఫస్ట్ మూవీకి ఏమాత్రం తక్కువగా ఉన్న నెక్స్ట్ పార్ట్ కచ్చితంగా ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది.

Telugu Chandramukhi, Das Ka Dhamki, Flop, Flop Sequels, Cream, Kabzaa, Michael,

మొదటి సినిమాలోనే మంచి ఎండింగ్ ఇచ్చారు కాబట్టి దీనికి సీక్వెల్ అనవసరమని చెప్పుకోవచ్చు.దాస్ కా ధమ్కీ( Das Ka Dhamki ) సినిమా ఆడింది అంతంత మాత్రమే.దానికి కూడా సీక్వెల్ చేయడానికి మేకర్స్ సిద్ధం కావడం పెద్ద సాహసమే.ఇక ఇవే కాకుండా ఐస్ క్రీమ్ సినిమాకి( Ice Cream Movie ) సీక్వెల్ తీసి ఆర్జీవి చేతులు కాల్చుకున్నాడు.

ఐస్ క్రీమ్ 2 సినిమా థియేటర్లలోకి వచ్చిందని కూడా ఎవరు తెలుసుకోలేకపోయారు.అంత దారుణంగా ఆ మూవీ ఫ్లాప్ అయ్యింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube