ఫ్లిప్‌కార్ట్‌లో అదిరిపోయే ఆఫర్.. రూ.4 వేలకే వాషింగ్ మెషిన్..!

ఈ రోజుల్లో చాలామంది వాషింగ్ మెషిన్లు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు.సుఖవంతమైన లైఫ్ లీడ్ చేయడానికి మొగ్గు చూపుతున్నారు.

 Flipkart Big Diwali Sale 2022 Washing Machine For Four Thousand Rupees,flipkart-TeluguStop.com

కానీ వాషింగ్ మెషిన్ల ధరలు కాస్త అధికంగా ఉండటంతో మధ్యతరగతి ప్రజలకు ఇవి అందని ద్రాక్షగా మిగిలిపోతున్నాయి.అయితే ఈ నేపథ్యంలో ఫ్లిప్‌కార్ట్ బడ్జెట్ వాషింగ్ మెషిన్లను మరింత తక్కువ ధరలకు సేల్ చేయడం ప్రారంభించింది.

ఫ్లిప్‌కార్ట్ ఇటీవల ప్రకటించిన బిగ్ దీపావళి సేల్ అక్టోబర్ 16 వరకు కొనసాగనుంది.ఐదు రోజుల పాటు జరిగే ఈ సేల్ ఎలక్ట్రానిక్ ఉపకరణాలపై అద్భుతమైన ఆఫర్లను తీసుకొచ్చింది.

శామ్‌సంగ్, ఎల్‌జీ, సోనీ, షియోమీ వంటి బ్రాండ్‌ల వాషింగ్ మెషిన్లపై తీసుకొచ్చిన డీల్‌లు, ఆఫర్లు మధ్య తరగతి ప్రజలను బాగా ఆకట్టుకుంటున్నాయి.వీటిలో ఒక డీల్ ఎక్కువమంది దృష్టిని ఆకర్షిస్తోంది.

Telugu Budget Machine, Flipkart, Flipkartbig, Flipkart Offers, Machine-Latest Ne

అదేంటంటే, ఫ్లిప్‌కార్ట్ “MarQ by Flipkart 7.5 kg Washer only White, Green” అనే వాషింగ్ మెషిన్‌పై 44% డిస్కౌంట్ అందిస్తోంది.దీని ఒరిజినల్ ప్రైస్ రూ.8,999 ఉండగా. స్పెషల్ ప్రైస్ కింద దీనిని రూ.4,990కే విక్రయిస్తోంది.ఈ డైరెక్ట్ డిస్కౌంట్ మాత్రమే కాకుండా యాక్సిస్ బ్యాంక్ కార్డుదారులు 5% అడిషనల్ క్యాష్‌బ్యాక్ సొంతం చేసుకోవచ్చు.దీనిపై ఎక్స్ఛేంజ్‌ ఆఫర్‌ను కూడా ఫ్లిప్‌కార్ట్ ఆఫర్ చేస్తోంది.కొనుగోలు దారులు తమ పాత వాషింగ్ మెషిన్‌ను ఎక్స్ఛేంజ్‌ చేసి రూ.2,200 వరకు డిస్కౌంట్ పొందవచ్చు.కాగా పాత వాషింగ్ మెషిన్ మోడల్, కండిషన్‌ను బట్టి ఎక్స్ఛేంజ్‌ ఆఫర్ అమౌంట్ నిర్ణయించడం జరుగుతుంది.ఈ ఆఫర్ ఫుల్‌గా వర్తిస్తే మీరు దీనిని జస్ట్ రూ.2,790కే కొనుగోలు చేయవచ్చును.

నెలకు రూ.173 ఈఎంఐతో కూడా మీరు దీనిని మీ సొంతం చేసుకోవచ్చు.అయితే ధర తక్కువగా ఉంది కాబట్టి ఇది కేవలం బట్టలను వాష్‌ చేస్తుంది.

ఆపై వాటిని వినియోగదారుల మాన్యువల్‌గా ఆరబెట్టుకోవాల్సి ఉంటుంది.దీని గురించి మరిన్ని వివరాలకు “MarQ by Flipkart 7.5 kg Washer only White, Green” అని ఫ్లిప్‌కార్ట్ సెర్చ్ బార్‌లో టైప్ చేసి చెక్ చేయవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube