తెలంగాణలో ఎన్నికల హడావుడి మొదలైపోయింది.ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడంతో అన్ని పార్టీలు అలెర్ట్ అయ్యాయి.
అన్నిటికంటే ముందుగా బీఆర్ఎస్( BRS ) తమ పార్టీ అభ్యర్థులను ప్రకటించడంతో పాటు, నియోజకవర్గాల వారీగా ఆ పార్టీ అధినేత సీఎం కేసీఆర్ ( CM kcr )భారీ బహిరంగ సభలు నిర్వహించే ప్లాన్ లో ఉండగా ,, బిజెపి కాంగ్రెస్ కూడా తమ పార్టీ అభ్యర్థులను ప్రకటించేందుకు సిద్ధమవుతున్నాయి.ముందుగా కాంగ్రెస్ తమ అభ్యర్థులను ప్రకటిస్తుందని అంతా భావించినా , అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ దాదాపుగా పూర్తయినా, మరికొద్ది రోజులపాటు దానిని వాయిదా వేయాలనే ఆలోచనలో ఉన్నారట .ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా అనేక సర్వేలు చేయించింది.నియోజకవర్గాల వారీగా గెలిచే అభ్యర్థుల జాబితాను సిద్ధం చేస్తుంది .
బీజేపీ కూడా తమ పార్టీ అభ్యర్థులను ప్రకటించిన తర్వాత కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించాలని ఆలోచనతో ఉందట.క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులంతా జనాల్లోకి వెళ్లే విధంగా వివిధ కార్యక్రమాలు ఇప్పటికే రూపకల్పన చేశారు.అది కాకుండా రేపు సాయంత్రం నాలుగు గంటలకు కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం కానుంది .ఈ సందర్భంగా కాంగ్రెస్ అభ్యర్థులను కేంద్ర ఎన్నికల కమిటీ ఖరారు చేసినా, ముందుగా అనుకున్న ప్రకారం తెలంగాణలో బస్సు యాత్రను పూర్తి చేసి , ఆ తరువాతే అభ్యర్థుల జాబితాను ప్రకటించాలని నిర్ణయించుకున్నారట. ఈనెల 14 తరువాత మరికొన్ని చేరికలు ఉండబోతుండడం, బిజెపి, బీఆర్ఎస్ ల నుంచి కీలక నేతలు పార్టీలో చేరే అవకాశం ఉండడంతో, మరికొద్ది రోజుల పాటు వేచి చూస్తే మంచిదనే ఆలోచనలో కాంగ్రెస్ పెద్దలు ఉన్నారట .భారీగా చేరికలను ప్రోత్సహించి బలమైన అభ్యర్థులను పోటీకి దించాలని ప్లాన్ లో ఉంది .
అందుకే బస్సు యాత్ర మొదలుపెట్టి ఆ తర్వాతే అభ్యర్థుల జాబితాను ప్రకటించాలని నిర్ణయించుకున్నారట.ఢిల్లీలో జరిగే కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశానికి తెలంగాణ నుంచి కీలక నాయకులు హాజరవుతున్నారు .రేవంత్ రెడ్డి( Revanth Reddy ) తో పాటు , సీఎల్పీ నాయకుడు భట్టి విక్రమార్క,( Bhatti Vikramarka ) తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్ రావు ఠాక్రే ఈ సమావేశంలో పాల్గొంటున్నారు.