ఏపీ ఫైబర్ నెట్ కేసులో పీటీ వారెంట్ పై విచారణకు విజయవాడలోని ఏసీబీ కోర్టు అనుమతి ఇచ్చింది.ఈ క్రమంలో సోమవారం టీడీపీ అధినేత చంద్రబాబును హాజరుపర్చాలని ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది.
ఈ క్రమంలో సోమవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు వర్చువల్ గా చంద్రబాబును హాజరుపరచాలని కోర్టు ఆదేశాలు ఇచ్చింది.రేపు సుప్రీంకోర్టులో తీర్పులు వస్తే జోక్యం చేసుకోవచ్చని ఏసీబీ కోర్టు న్యాయమూర్తి టీడీపీ న్యాయవాదులకు సూచించారు.
కాగా ఫైబర్ నెట్ కేసులో పీటీ వారెంట్ పై సుదీర్ఘ వాదనలు కొనసాగాయి.సీఐడీ తరపున న్యాయవాది వివేకానంద వాదనలు వినిపించారు.
ఈ క్రమంలో పీటీ వారెంట్ పై వాదనలు కొనసాగించేందుకు సమ్మతించిన ఏసీబీ కోర్టు చంద్రబాబును సోమవారం కోర్టులో ఎదుట హజరు పర్చాలని తెలిపింది.