అనసూయ బర్త్ డే సందర్భంగా ‘వాంటెడ్ పండుగాడ్’ నుంచి ఫస్ట్ లుక్ విడుదల

శ‌తాధిక చిత్ర ద‌ర్శ‌కుడు.ద‌ర్శ‌కేంద్రుడు కె.

 First Look Release From 'wanted Pandugad' On The Occasion Of Anasuya's Birthday-TeluguStop.com

రాఘ‌వేంద్ర‌రావు స‌మ‌ర్ప‌ణ‌లో యునైటెడ్ కె ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై సునీల్, అన‌సూయ భ‌ర‌ద్వాజ్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా శ్రీధ‌ర్ సీపాన ద‌ర్శ‌క‌త్వంలో సాయిబాబ కోవెల మూడి, వెంక‌ట్ కోవెల మూడి నిర్మాతలుగా రూపొందుతోన్న చిత్రం ‘వాంటెడ్ పండుగాడ్’.‘పట్టుకుంటే కోటి’ ట్యాగ్ లైన్.

ఆదివారం అన‌సూయ భ‌ర‌ద్వాజ్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఈ సినిమా నుంచి అనసూయ ఫ‌స్ట్ లుక్‌తో పాటు వీడియోను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది.

ఈ సంద‌ర్బంగా నిర్మాత‌లు మాట్లాడుతూ ‘‘శ్రీధర్ సీపానగారి దర్శకత్వంలో హిలేరియస్ ఎంటర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కుతోన్న సినిమా ‘వాంటెడ్ పండుగాడ్’ అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను మెప్పించేలా ఉంటుంది.

ప్ర‌ముఖ ర‌చ‌యిత జ‌నార్ధ‌న మ‌హ‌ర్షి ఈ చిత్రానికి క‌థ‌, మాట‌లు, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు.మారేడుమిల్లిలో పెద్ద షెడ్యూల్‌ను పూర్తి చేశాం.

త‌ర్వాత హైద‌రాబాద్ ప‌రిస‌ర ప్రాంతాల్లో కొంత షూటింగ్ చేశాం.సినిమా షూటింగ్ దాదాపు పూర్త‌య్యింది.

మూడు, నాలుగు రోజులు మాత్ర‌మే బ్యాలెన్స్ ఉంది.అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి త్వ‌ర‌లోనే సినిమా రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేస్తాం’’ అన్నారు.

ఈ చిత్రానికి మ‌హి రెడ్డి పండుగుల సినిమాటోగ్ర‌ఫీ.పి.ఆర్ సంగీతాన్ని అందిస్తున్నారు.

నటీనటులు:

సునీల్, అన‌సూయ భ‌ర‌ద్వాజ్‌, వెన్నెల కిషోర్‌, స‌ప్త‌గిరి, శ్రీనివాస్ రెడ్డి సుడిగాలి సుధీర్‌, దీపికా పిల్లి, బ్ర‌హ్మానందం, ర‌ఘుబాబు, అనంత్, పుష్ప జ‌గ‌దీష్‌, నిత్యా శెట్టి, వసంతి, విష్ణు ప్రియ‌, హేమ‌, ష‌క‌ల‌క శంక‌ర్‌, త‌నికెళ్ల భ‌ర‌ణి, ఆమ‌ని, థ‌ర్టీ ఇయ‌ర్స్ పృథ్వీ త‌దిత‌రులు

సాంకేతిక వ‌ర్గం:

స‌మ‌ర్ప‌ణ : కె.రాఘ‌వేంద్ర‌రావు, బ్యాన‌ర్ : యునైటెడ్ కె ప్రొడ‌క్ష‌న్స్‌ , నిర్మాత‌లు : సాయి బాబ కోవెల‌మూడి, వెంక‌ట్ కోవెల మూడి, ద‌ర్శ‌క‌త్వం : శ్రీధ‌ర్ సీపాన‌, క‌థ‌, మాట‌లు, స్క్రీన్ ప్లే : జ‌నార్ధ‌న మ‌హ‌ర్షి సినిమాటోగ్ర‌ఫీ : మ‌హి రెడ్డి పండుగుల‌, మ్యూజిక్ : పి.ఆర్‌ ఎడిట‌ర్ : త‌మ్మిరాజు, ఆర్ట్ : కిర‌ణ్ కుమార్ మ‌న్నె, ఫైట్స్ : రియ‌ల్ స‌తీష్‌, కొరియోగ్రాఫ‌ర్ : య‌ష్‌, కో డైరెక్ట‌ర్ : కె.వెంక‌ట ర‌త్నం ప్రొడ‌క్ష‌న్ ఎగ్జిక్యూటివ్ : ఎం.ఎన్‌.ఎస్.రాయుడు, ప్రొడ‌క్ష‌న్ కంట్రోల‌ర్ : వి.మోహ‌న్ రావ్‌, కో ప్రొడ్యూస‌ర్ : జోసెఫ్ పి.రెడ్డి

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube