మెదక్ జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది.ఆగి ఉన్న కంటైనర్ లారీని మరొక కంటైనర్ లారీ ఢీకొట్టింది.
ఈ ఘటనతో వెనుక ఉన్న లారీలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఇద్దరు సజీవ దహనం అయ్యారు.నార్సింగి మండలం కాస్లాపూర్ సమీపంలో జాతీయ రహదారిపై ఈ ఘటన చోటు చేసుకుంది.
సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.అదేవిధంగా ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు మృతులు కర్ణాటక వాసులుగా గుర్తించారు.