బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ షో సీజన్ 7( Bigg Boss 7 ) వచ్చే నెల 3వ తేదీ నుంచి స్టార్ మా ఛానల్ లో ప్రారంభం కానుందనే సంగతి తెలిసిందే.బిగ్ బాస్ షో సీజన్7 లో శృంగార తార షకీలా( Shakeela ) కనిపించనున్నారని ప్రచారం జరుగుతుండగా ఆ ప్రచారంలో నిజానిజాలు తెలియాల్సి ఉంది.
వివాదాస్పద కంటెస్టెంట్లను ఈ షోకు ఎక్కువగా ఎంపిక చేయడం జరుగుతోందని సమాచారం అందుతోంది.జబర్దస్త్ వర్ష( Jabardasth Varsha ) ఇప్పటికే ఈ షోకు ఫిక్స్ అయ్యారు.
యువ రైతు పల్లవి ప్రశాంత్ కు కూడా ఈ షోలో ఛాన్స్ దక్కినట్టు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.షకీలా వృత్తిరిత్యా బోల్డ్ రోల్స్ లో నటించినా వ్యక్తిగతంగా ఆమె చాలా మంచివారని ఇండస్ట్రీలో టాక్ ఉంది.
బిగ్ బాస్ షో కోసం షకీలాకు భారీ స్థాయిలో రెమ్యునరేషన్ ను ( Remuneration ) ఆఫర్ చేశారని తెలుస్తోంది.షకీలా ప్రస్తుతం ఎక్కువ సంఖ్యలో సినిమాలలో నటించడం లేదు.
అందువల్ల ఈ ఆఫర్ ఆమెకు బెస్ట్ ఆఫర్ అనే చెప్పాలి.
బిగ్ బాస్ షోలో లాస్ట్ వీక్ వరకు ఉన్నా 50 లక్షల కంటే ఎక్కువ మొత్తాన్ని షకీలా పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.బిగ్ బాస్ షో ఎంట్రీ గురించి షకీలా ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది.బిగ్ బాస్ షో కంటెస్టెంట్ల ఎంపికలో షో నిర్వాహకులు ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారని సమాచారం.
కింగ్ నాగార్జున( Nagarjuna ) హోస్టింగ్ విషయంలో కూడా కీలక మార్పులు చేశారు.
నాగార్జునకు గత సీజన్లతో పోల్చి చూస్తే ఈ సీజన్ కు ఎక్కువ మొత్తం రెమ్యునరేషన్( Nagarjuna Remuneration ) దక్కేలా బిగ్ బాస్ నిర్వాహకులతో ఒప్పందం కుదిరిందని సమాచారం అందుతోంది.నాగార్జున సినీ కెరీర్ ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.