తెలుగు ప్రేక్షకులకు టాలీవుడ్ ప్రముఖ డాన్స్ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్( Choreographer Rakesh Master ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.గత కొద్ది రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న రాకేష్ మాస్టర్ తాజాగా ఆదివారం సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో తుదిశ్వాస విడిచారు.
ఇటీవల విజయనగరం నుంచి హైదరాబాద్ కు వస్తున్న సమయంలో వడదెబ్బకు గాంధీ ఆసుపత్రికి( Gandhi Hospital ) తరలించారు.హాస్పటల్లో చికిత్స పొందుతూ తాజాగా తుదిశ్వాస విడిచారు.
రాకేష్ మాస్టర్ మరణంతో ఒక్కసారిగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
ఆదివారం ఉదయం రక్తపు వాంతులు, విరేచనాలు అవ్వడంతో పరిస్థితి విషమించింది.
దాంతో మధ్యాహ్నం సమయంలో ఆయన్ను గాంధీ ఆస్పత్రికి తరలించారు.ఆయన్ను కాపాడేందుకు గాంధీ ఆస్పత్రి వైద్యులు విశ్వప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.
రాకేష్ మాస్టర్ డయాబెటిక్ అని తెలిసింది.సివియర్ మెటబాలిక్ ఎసిడోసిస్ కావడంతో మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ అయ్యింది.
బీపీ లెవెల్స్ పూర్తిగా పడిపోయాయి.హై షుగర్ ఉండటంతో శ్వాస తీసుకోవటంతో ఇబ్బంది పడ్డారు.
కృత్రిమంగా శ్వాసను అందించే ప్రయత్నం చేసినా, వెంటిలేటర్‌పై ఉంచినా ప్రయోజనం లేకపోయింది.
అయితే మొన్నటి వరకు వీడియోలు తీస్తూ ఎంచక్కా సరదాగా అందరిని నవ్విస్తూ ఉన్న రాకేశ్ మాస్టర్ ఒక్కసారిగా మరణించాడు అన్న వార్త తెలిసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు.నిన్న మొన్నటివరకు ఆయన వీడియోలు చేశారని.ఇంతలోనే ఇలా జరగడం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
కాగా రాకేష్ మాస్టర్‌కి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు.కుటుంబ సభ్యులు రాకేశ్ మాస్టర్ కళ్లను( Rakesh Master Eyes Donate ) దానం చేసేందుకు అంగీకరించారు.
కాగా నేడు అనగా సోమవారం బోరబండలో రాకేశ్ మాస్టర్ అంత్యక్రియలు జరగనున్నాయి.ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు ఆయన భౌతికకాయానికి నివాళులు అర్పించారు.చాలామంది అభిమానులు నెటిజన్స్ ఆయన మరణవార్తను జీర్ణించుకోలేకపోతున్నారు.అయితే రాకేష్ మాస్టర్ కళ్లను దానం చేయడానికి కుటుంబ సభ్యులు అంగీకారం తెలపడంతో నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు.ఆయన మరణించి ఈ లోకాన్ని విడిచి వెళ్ళినప్పటికీ ఆయన కళ్ళు మాత్రం ఈ లోకాన్ని చూడగలుగుతాయి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.