ఉన్నత ఉద్యోగం కోసమో, లేదంటే తమ కుటుంబానికి ఆర్ధిక భరోసా ఇవ్వడం కోసమే ఎంతో మంది ఎన్నారైలు తమ సొంత ప్రాంతాలని వదిలి, కుటుంబాలకి దూరంగా భారత్ నుంచీ విదేశాలకు వలసలు వెళ్తూ ఉంటారు.అలా వెళ్ళిన ఎంతో మంది భారతీయులు ఆయా దేశాలలో ఉన్నత స్థానాలలో ఉంటూ తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంటుంటే, మరో కొందరు ఎన్నారైలు మాత్రం డబ్బుకోసం కక్కూర్తి పడుతూ అడ్డ దారులు తొక్కుతున్నారు.
తాజాగా కువైట్ లో కొందరు భారత ఎన్నారైలు వేరు వేరు సంఘటనలలో పోలీసులకు అడ్డంగా దొరికిపోయి కటకటాల పాలయ్యారు.
వివరాలలోకి వెళ్తే
కువైట్ లో సబా అల్ సలేం అనే రక్త పరీక్షా కేంద్రంలో భారత్ , ఈజిప్ట్ లకు చెందిన కొందరు పని చేస్తున్నారు.
వీరు రక్త పరీక్షలకు సంబంధించిన రిపోర్ట్ లు ఇచ్చే క్రమంలో లంచాలు తీసుకుంటూ తప్పుడు నివేదికలు ఇస్తున్నారు.అయితే ఈ పరిస్థితిపై కొందరు ఎన్నారైలు కువైట్ ప్రభుత్వానికి ఫిర్యాదు చేయడంతో పక్కా ప్రణాళికతో వారిని పట్టుకున్నారు.
ఆదేశ ఆరోగ్య శాఖాదికారులు ఒక్కసారిగా రక్త పరీక్షా కేంద్రంపై దాడి చేసి సిద్దంగా ఉన్న బ్లడ్ రిపోర్ట్ ను సాదీనం చేసుకున్నారు.అందులో ఉన్న వారి వివరాలను సేకరించి వారిని పిలిపించి మళ్ళీ రక్త పరీక్షలు చేయించారు.
ఈ క్రమంలో హెపటైటిస్ జబ్బులు ఉన్న వారికి కూడా సదరు ల్యాబ్ ఆ జబ్బులు లేనట్టుగా రిపోర్ట్ ఇవ్వడం గమనించారు.దాంతో ల్యాబ్ ను సీజ్ చేయడమే కాకుండా భారత్, ఈజిప్ట్ దేశాలకు చెందిన వలస వాసులను అరెస్ట్ చేసి కోర్టు ముందు ప్రవేశపెట్టారు.
దాంతో అక్కడి న్యాయస్థానం వారి ఒక్కొకరికి 10 ఏళ్ళ జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది.ఇదిలా ఉంటే మద్యం వాఫ్రా ప్రాంతంలో ఇంట్లో అక్రమంగా మద్యం తయారు చేస్తున్న ఇద్దరు భారతీయ ఎన్నారైలను స్థానిక పోలీసులు అరెస్ట్ చేశారు.
వీరిని త్వరలో కోర్టులో ప్రవేశపెట్టనున్నట్టుగా పోలీసు అధికారులు వెల్లడించారు.