ఉన్నట్లుండి కిందపడి దొర్లుతూ డ్యాన్స్.. మేమెక్కడా చూడలేదంటున్న నెటిజన్లు..

వేడుక ఏదైనా ఇటీవల కాలంలో డీజే పాటలు పెట్టి డ్యాన్స్‌ చేయడం పరిపాటిగా మారింది.ముఖ్యంగా కుర్రాళ్లు డీజే పాటలకు డ్యాన్స్ చేయడమంటే చాలా ఇష్టం చూపుతున్నారు.

 Falling Down And Dancing ,dance Video, Rolling Om Floor Dance, Viral Video, Vira-TeluguStop.com

తమకు డ్యాన్స్ వచ్చా రాదా అనే విషయాన్ని పక్కన పెట్టి చిందేస్తున్నారు.కొందరైతే కొంచెం మందు తాగితే చాలు ప్రొఫెషనల్ డ్యాన్సర్‌లా మారి స్టెప్పులు వేసేస్తారు.

కొన్ని సార్లు అవి చూడడానికి భలేగా ఉంటాయి.ఇంకొన్ని సందర్భాల్లో విచిత్రంగా అనిపిస్తుంది.

అప్పటి వరకు బాగానే ఉన్న కొందరు డీజే పాటలు వినగానే పూనకం వచ్చినట్లు ఊగిపోతారు.చిత్రవిచిత్ర స్టెప్పులతో వేడుకలో నానా రచ్చ చేస్తారు.

తాజాగా ఇలాంటి ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

ఇటీవల ఓ పెళ్లి వేడుకకు సంబంధించిన వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతోంది.అందులో డీజే పాటలకు అతిథులంతా ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తుంటారు.చాలా మంది కూర్చుని, నిల్చుని చూస్తుంటారు.అయితే అలా కూర్చున్న వారిలో ఓ వ్యక్తి డీజే పాటకు బాగా ఆకర్షితుడయ్యాడు.

తొలుత తన తలను ఇష్టానుసారంగా ఊపుతూ, చుట్టూ ఉన్న వారి దృష్టి తన వైపునకు తిప్పుకున్నాడు.ఇక అంతటితో ఆగకుండా ఒక్కసారిగా కుర్చీలో నుంచి కింద పడిపోయాడు.

పడిపోయిన వాడు పడిపోయినట్లు ఉండకుండా దొర్లుతూ డ్యాన్స్ చేశాడు.దీంతో చుట్టూ ఉన్న వారు ఉత్సాహంగా అతడిని మరింత ఎంకరేజ్ చేశారు.

చివరలో కొందరు వచ్చి అతడిని పైకి లేపి కుర్చీలో కూర్చోబెట్టారు.

దీనిని videonation.teb అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేయగా, విపరీతంగా వైరల్ అవుతోంది.దానికి నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు.

తామింకా అతడికి ఏదో ఫిట్స్ వచ్చిందని అనుకున్నామని వ్యాఖ్యానిస్తున్నారు.ఇంకొందరు తాము బెల్లీ డ్యాన్స్, వెస్ట్రన్ డ్యాన్స్, జుంబా డ్యాన్స్, ఫోక్ డ్యాన్స్, క్లాసికల్ డ్యాన్స్ వంటివి తెలుసుని కానీ ఆ యువకుడు చేసిన డ్యాన్స్ ఏ కోవలోకి వస్తుందో అర్ధం కావడం లేదని కామెంట్లు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube