ప్రచారానికి కలిసి రాబోతున్న ప్రవాసాంధ్రులు..!

ప్రస్తుతం భారతదేశంలో ఎన్నికల నేపథ్యంలో పెద్ద ఎత్తున రాజకీయ పార్టీలు( Political parties ) ఎలక్షన్ క్యాంపెయిన్స్ లో ముమ్మరంగా బిజీగా ఉన్నాయి.ఇప్పటికే అన్ని పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు ఆయా నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున రాజకీయ సభలను ఏర్పాటు చేసి ప్రజలను తమ వైపుకు తిప్పుకొనేలా ప్రయత్నాలు చేస్తున్నారు.

 Expatriates Who Are Going To Come Together For The Campaign, Tdp, Nri, Campain,-TeluguStop.com

ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విషయానికొస్తే లోక్సభ స్థానాలతో పాటు అసెంబ్లీ స్థానాలకు సంబంధించి కూడా ఎన్నికలు మే 13న జరగబోతున్న సంగతి తెలిసిందే.దీంతో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ వాతావరణం వేడెక్కింది.

పెద్ద ఎత్తున అన్ని పార్టీల ప్రముఖులు రాష్ట్ర మొత్తం తిరుగుతూ ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు.

Telugu Campain, Expatriates, Latest Nri-Latest News - Telugu

ఇక ఇప్పుడు మాతృభూమిపై మమకారం చాటేందుకు ఎన్నికల ప్రచారంలోకి ఎన్నారై లను( NRIs ) రంగంలోకి దించబోతోంది కూటమి.అభివృద్ధిని ఆకాంక్షించే ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్న దిశతో ఎక్కడో విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నవారు తమ విధులను కొద్ది రోజులు సెలవు పెట్టి ప్రచారం చేయడానికి 1000 మంది రాష్ట్రానికి రాబోతున్నట్లు తెలుస్తోంది.

Telugu Campain, Expatriates, Latest Nri-Latest News - Telugu

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో టిడిపి, బిజెపి, జనసేన( TDP, BJP, Jana Sena ) కూడిన సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు కావాలన్న ఉద్దేశంతో కొంతమంది ప్రవాస ఆంధ్రులు ప్రచార రంగంలోకి రాబోతున్నారు.కేవలం ప్రవాస ఆంధ్రులకు మాత్రమే కాకుండా హైదరాబాద్ నుంచి కూడా 500 మంది సాఫ్ట్వేర్ ఉద్యోగులు కూడా ఆంధ్రప్రదేశ్ కు చేరనున్నారు.ఇక ఇప్పటికే ఎవరెవరు ఏ నియోజవర్గాల్లో ప్రచారం చేయాలో ఇప్పటికే కార్యాచరణ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.

ఇందుకు సంబంధించి టిడిపి ఎన్నారై విభాగం అధ్యక్షుడు రవికుమార్ వేమూరి( President Ravikumar Vemuri ) ఓ ప్రత్యేక యాప్ కూడా రూపొందించారు.ఏప్రిల్ 18 నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల నామినేషన్ ప్రక్రియ మొదలు కాబోతున్న నేపథ్యంలో వారు మరింత దూకుడును పెంచారు.

ఇక ప్రజలకు నేరుగా వెళ్లి ప్రచారం చేయలేని వారు ఫోన్ల ద్వారా స్థానికులను అవగాహన కల్పించేందుకు ప్రయత్నం చేస్తున్నారు.ఆ తర్వాత ఎస్టీ, ఎస్సీ నియోజకవర్గాల్లో కూడా వీరు పర్యటన చేయబోతున్నారు.

ఇదివరకు టిడిపి హయాంలో జరిగిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ వారు ఈసారి ఓట్లను అడిగేందుకు ప్రయత్నం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube