టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన ముంబై ముద్దుగుమ్మ భూమికా చావ్లా( Bhumika Chawla ) గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.తొలి చూపులతోనే తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది భూమిక.
అందం పరంగా మాత్రం అందర్నీ ఫిదా చేసింది.ఇక తెలుగులో చాలా సినిమాలలో నటించి తెలుగు ప్రేక్షకులతో మంచి అభిమానం పెంచుకుంది.
భూమిక తొలిసారిగా 2000 సంవత్సరంలో యువకుడు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది.ఇక ఈ సినిమా తర్వాత ఖుషి సినిమాలో నటించగా.
ఇందులో తన క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో, తన నటనతో అందర్నీ బాగా ఆకట్టుకుంది.ఈ సినిమా తనకు బాగా కలిసి వచ్చింది.
దీంతో ఆ తర్వాత వరుసగా అవకాశాలు వచ్చాయి.అలా మిస్సమ్మ, సింహాద్రి( Simhadri ), ఒక్కడు, వాసు, అనసూయ ఇలా ఎన్నో సినిమాలలో నటించి మంచి పేరు సంపాదించుకుంది.
చాలావరకు స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హోదాకు చేరుకుంది.ఆ తర్వాత వయసు కాస్త మీద పడటంతో కొన్ని సినిమాలలో హీరోయిన్ గా కాకుండా కొన్ని ప్రధాన పాత్రలలో కూడా చేసింది.తన నటనకు పలు అవార్డులు కూడా సొంతం చేసుకుంది.కేవలం తెలుగు భాషలోనే కాకుండా ఇతర భాషలలో కూడా చేసింది.అక్కడ కూడా తన నటనకు మంచి గుర్తింపు అందుకుంది.
ఇక వయసు మీద పడిన కొద్దీ హీరోయిన్ గా అవకాశాలు తగ్గటంతో.వదిన పాత్రలో, అక్క పాత్రలో కూడా చేసింది.ఇక ప్రస్తుతం హీరోయిన్ పాత్రలకు దూరంగా ఉంటూ కేవలం సహాయ పాత్రలలోనే నటిస్తుంది.
ఇక భూమిక కెరీర్ మొదట్లో ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది.అందం విషయంలో ఏమాత్రం అస్సలు తగ్గలేదు.అప్పుడు ఏ అందంతో ఉందో ఇప్పుడు కూడా అదే అందంతో ఉంది.
వయసు పెంచుకుంటున్న కొద్ది అందాన్ని కూడా పెంచుకుంటూ పోతుంది.సోషల్ మీడియా( Social media )లో మాత్రం బాగా యాక్టివ్ గా కనిపిస్తూ ఉంటుంది.నిత్యం ఏదో ఒక ఫోటో షేర్ చేస్తూ ఉంటుంది.
తన భర్తతో దిగిన ఫోటోలను బాగా పంచుకుంటూ ఉంటుంది.భూమిక ఎప్పుడు గ్లామర్ షో చేసినట్లు అంతగా అనిపించలేదు.
కానీ ఈమధ్య అందాలను బయటపెడుతుంది.అయితే ఇదంతా పక్కన పెడితే ఈరోజు తన బర్త్డే సందర్భంగా.
తన ఫ్యామిలీతో కలిసి పార్టీ చేసుకోగా వారితో కలిసి దిగిన ఫొటోస్ పంచుకుంది.ఇక అందులో భూమిక ఇప్పటికీ అంతే అందమని చెప్పాలి.40 ఏళ్లు దాటినా కూడా ఆమె చూడటానికి పాతికేలా అమ్మాయిలాగా కనిపించింది.పైగా ఆమె నడుము అందాలు మాత్రం ఇప్పటికీ చెక్కుచెదరన్నట్లుగా ఉంది.
ప్రస్తుతం ఆమె పుట్టినరోజు ఫొటోస్ బాగా వైరల్ అవుతున్నాయి.ఇక ఆ ఫొటోస్ చూసి ఆమె అభిమానులు మీరు 60 ఏళ్లు దాటినా కూడా ఇలాగే ఉంటారు అంటూ ఆమె అందాన్ని పొగుడుతున్నారు.