ప్రపంచ కప్ చరిత్రలో అత్యంత చెత్త రికార్డు సృష్టించిన తొలి జట్టుగా ఇంగ్లాండ్..!

వన్డే వరల్డ్ కప్( ODI World Cup ) లో తాజాగా జరిగిన మ్యాచ్లో పసికూన ఆఫ్ఘనిస్తాన్ చేతిలో ఘోరంగా ఇంగ్లాండ్ ఓటమి పాలైన సంగతి తెలిసిందే.గత టోర్నీలో టైటిల్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు ఈ టోర్నీలో చెత్త ఓటములను ఖాతాలో వేసుకుంటోంది.తాజాగా జరిగిన మ్యాచ్లో ఓడటం వల్ల ప్రపంచ కప్ చరిత్రలో అన్ని టెస్ట్ ప్లేయింగ్ జట్ల (11) చేతుల్లో ఓడిన తొలి జట్టుగా ఇంగ్లాండ్( England ) రికార్డ్ సృష్టించింది.1975లో జరిగిన వరల్డ్ కప్ లో ఆసియా చేతిలో ఇంగ్లాండ్ ఓటమిపాలైంది.1979 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో వెస్టిండీస్ చేతిలో ఓటమిపాలైంది.1983, 1987 ప్రపంచ కప్ లలో పాకిస్తాన్, న్యూజిలాండ్, భారత్ చేతులలో ఓటమిపాలైంది.1992 ప్రపంచ కప్ లో జింబాబ్వే( Zimbabwe ) చేతిలో ఘోరంగా ఓటమిపాలైంది.1996 ప్రపంచ కప్ లో సౌత్ ఆఫ్రికా, శ్రీలంక చేతుల్లో ఘోరంగా ఓటమిపాలైంది.2011 ప్రపంచ కప్ లో ఐర్లాండ్, బంగ్లాదేశ్ చేతులలో ఓటమిపాలైంది.

 England Became The First Team To Create The Worst Record In The History Of The-TeluguStop.com

తాజాగా 2023 ప్రపంచ కప్ లో ఆఫ్ఘనిస్తాన్ చేతిలో ఓటమిపాలైంది.దీంతో ఇంగ్లాండ్ జట్టు అన్ని టెస్ట్ ప్లేయింగ్ దేశాల చేతుల్లో ఓటములు ఎదుర్కొన్న తొలి జట్టుగా అత్యంత పరమ చెత్త రికార్డును ఖాతాలో వేసుకుంది.

2023 ప్రపంచ కప్ లో తాజాగా జరిగిన మ్యాచ్ విషయానికి వస్తే.అక్టోబర్ 15న న్యూఢిల్లీ వేదికగా జరిగిన మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్( Afghanistan ) జట్టు 49.5 ఓవర్లలో అన్ని వికెట్లను కోల్పోయి 284 పరుగులు చేసింది.అనంతరం లక్ష్య చేదనకు దిగిన ఇంగ్లాండ్ జట్టు 40.3 ఓవర్లలో అన్ని వికెట్లను కోల్పోయి కేవలం 215 పరుగులు మాత్రమే చేసి, ఏకంగా 69 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube