ప్రస్తుత రోజుల్లో అందరూ ఫాస్ట్‌ఫుడ్‌కు ( Fastfood ) బాగా అలవాటు పడ్డారు.సాయంత్రం అయితే చాలు బయటకు వెళ్లి పుణుగులు, బజ్జీలు, పకోడీలు, పానీపూరీలు తినడానికి ఇష్టపడతారు.
దీంతో సాయంకాలం సమయంలో రోడ్ల పక్కన ఉండే ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు కిటకిటలాడుతుంటాయి.అయితే మనుషులంతా ఇలా ఫాస్ట్ ఫుడ్‌కు బాగా అలవాటు పడుతున్నారు.
ఇక ఇవే కాకుండా నూడుల్స్, ఫ్రైడ్ రైస్ వంటివి కూడా ఎక్కువ మంది ప్రిఫర్ చేస్తుంటారు.
అయితే మనుషులు ఇంట్లో వండినవి కాకుండా ఇలా ఫాస్ట్ ఫుడ్‌కు అలవాటు పడి చాలా మంది అనారోగ్యాలు కొనితెచ్చుకుంటున్నారు.
ఇక జంతువులు( Animals ) కూడా ఫాస్ట్ ఫుడ్‌కు అలవాటు పడ్డాయంటే నమ్ముతారా? కానీ నిజం.ఓ జూ పార్క్‌లో ఏనుగులు( Elephant ) ఫాస్ట్ ఫుడ్‌కు బాగా అలవాటు పడ్డాయి.
దీనికి సంబంధించిన ఆసక్తికర విషయాలిలా ఉన్నాయి.
శ్రీలంకలోని యాలా నేషనల్ పార్క్‌లో( Yala National Park ) ఓ కుటుంబం విహార యాత్రకు వెళ్లింది.ఆ సమయంలో ఓ అడవి ఏనుగు ఆ కుటుంబం వద్దకు వచ్చింది.వారు ప్రయాణిస్తున్న వ్యాన్ సమీపంలోకి ఆ ఏనుగు రాగానే ఆ పర్యాటకులు భయపడ్డారు.
వ్యాన్ కిటికీని పగులగొట్టి పర్యాటకులను ఆశ్చర్యపరిచింది.ఏనుగు డ్రైవింగ్ సీటు వైపు వెళ్లడంతో అందులోని వారంతా భయంతో కేకలు పెట్టారు.
ఆ ఏనుగు వ్యాన్‌లో ఏదైనా తినడానికి ఉందేమోనని బాగా వెతికింది.ఈ విషయం వ్యాన్ డ్రైవర్‌కు అర్ధం అయింది.
“ఇది ఆహారం కోసం మా వ్యాన్ చుట్టూ తిరుగుతోంది.డ్రైవర్ మా వద్ద ఉన్నదంతా ఇవ్వమని చెప్పాడు.కాబట్టి నేను నా కొడుకు మిగిలిపోయిన శాండ్‌విచ్‌ను( Sandwich ) దానికి తినిపించాను” అని తన కుటుంబంతో నేషనల్ పార్క్‌కి ప్రయాణిస్తున్న ఆస్ట్రేలియన్ కసున్ బస్నాయక్ చెన్నారు.తమ వద్ద ఉన్న చిప్స్, శాండ్‌విచ్ ఇవ్వగానే ఆ ఏనుగు వెళ్లిపోయిందని పేర్కొన్నారు.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగానే నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.ఏనుగు కూడా ఫాస్ట్ ఫుడ్‌కు అలవాటు పడిందని కామెంట్లు చేస్తున్నారు.