తెలంగాణ బీజేపీ నేత బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు.నాయకులు ముఖ్యం కాదన్న ఆయన కార్యకర్తలే ముఖ్యమని చెప్పారు.
ఈ క్రమంలో కొంతమందికి చెబుతున్నా ఫిర్యాదులు చేయడం మానాలంటూ సూచించారు.తన మీద ఫిర్యాదు చేస్తే చేశారేమో కానీ కిషన్ రెడ్డిపై చేయకండి అంటూ వ్యాఖ్యానించారు.
కనీసం కిషన్ రెడ్డిని అయినా ప్రశాంతంగా పని చేయనివ్వాలని కోరారు.అదేవిధంగా ఢిల్లీ వెళ్లి తప్పుడు నివేదికలు ఇవ్వకండని తెలిపారు.
రామరాజ్యం రావడానికి ప్రతీ కార్యకర్త కృషి చేయాలని బండి సంజయ్ పిలుపునిచ్చారు.