సినీ ఇండస్ట్రీకి చెందిన వాళ్లు ప్రేమ, పెళ్లిల విషయంలో అంత సీరియస్ తీసుకోరు.కాస్త గ్యాప్ వస్తే చాలు వెంటనే బ్రేకప్ చెప్పేసుకుంటారు.
చిన్న చిన్న మనస్పర్దాలకే పెద్ద గొడవలు చేసుకుంటుంటారు.అందుకే వారు వెనుక ముందు ఆలోచించకుండా వెంటనే విడాకులు తీసుకుంటూ ఉంటారు.
నిజానికి ప్రేమించిన వ్యక్తితో కూడా ఎక్కువ రోజులు ఉండలేకపోతుంటారు.కానీ యాంకర్ అనసూయ అలా కాదు.
ప్రేమించిన వ్యక్తి కోసం ఏకంగా తొమ్మిదేళ్లు ఆగిందని తెలిసింది.ఇంతకు ఏ కారణంతో ఆగిందో ఇప్పుడు తెలుసుకుందాం.
బుల్లితెరపై హాట్ యాంకర్ గా ఒక ముద్ర వేసుకొని తెలుగు ప్రేక్షకులను తన వైపుకు మలుపుకుంది అనసూయ.అందాలతో మాత్రం కుర్రాళ్ల మనసులు దోచుకొని అతి తక్కువ సమయంలో తన గ్లామర్ తో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది.
వెండితెరపై కూడా పలు సినిమాలలో నటించి మంచి క్రేజ్ ను సంపాదించుకుంది.ప్రస్తుతం వెండితెరపై వరుస ప్రాజెక్టులతో ఓ రేంజ్ లో దూసుకుపోతుంది.ఈమె తొలిసారిగా ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ షో ( Jabardasth Show )ద్వారా తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు పరిచయమైంది.అంతకుముందే వెండితెరపై పలు సినిమాలలో నటించింది.
కానీ అంత సక్సెస్ అందుకోలేకపోయింది.ఇక జబర్దస్త్ లో అడుగుపెట్టాక బుల్లితెర పైనే కాకుండా వెండితెరపై కూడా మంచి గుర్తింపు సొంతం చేసుకుంది.
రామ్ చరణ్ నటించిన రంగస్థలం సినిమాలో రంగమ్మత్త పాత్రలో ఓ రేంజ్ లో ఆకట్టుకుంది అనసూయ.
ఆ తర్వాత వరుస అవకాశాలు అందుకుంది.పలు సినిమాలలో స్పెషల్ సాంగ్ లో కూడా నటించింది.పాన్ ఇండియా మూవీ పుష్పలో నెగటివ్ రోల్ తో బాగా ఆకట్టుకుంది.
ఇక పుష్ప 2 ( Pushpa 2 )లో కూడా బిజీగా ఉంది.సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా కనిపిస్తుంది.
నిత్యం హాట్ ఫోటోలను, డాన్స్ వీడియోలను అభిమానులతో బాగా పంచుకుంటుంది.అనసూయ శశాంక్ భరద్వాజ్ ( Shashank Bhardwaj )ను పెళ్లి చేసుకోగా ఈమెకు ఇద్దరు కొడుకులు ఉన్నారు.
అయినా కూడా తన అందంతో ఎటువంటి మార్పు లేదు.లేటు వయసులో కూడా తన అందాలను ఆరబోస్తుంది.
ఇక సోషల్ మీడియాలో వాటిని పంచుకుంటూ బాగా సందడి చేస్తుంది.నిత్యం ఫోటో షూట్లతో బాగా హడావుడి చేస్తుంది.
అప్పుడప్పుడు అభిమానులతో ముచ్చట్లు కూడా పెడుతూ ఉంటుంది ఈ హాట్ బ్యూటీ.
అయితే ఇదంతా పక్కన పెడితే అనసూయ తను ఇంటర్ చదువుతున్న వయసులో ఎన్సీసీ కోర్సులో చేరింది.ఆ సమయంలో తనకు శశాంక్ భరద్వాజ్ తో పరిచయం ఏర్పడింది.దాంతో ఇద్దరు ప్రేమలో పడ్డారు.
ఇక తమకు పెళ్లి వయసు వచ్చినప్పుడు తమ ప్రేమ గురించి తమ ఇంట్లో చెప్పుకున్నారు.అయితే అనసూయ తండ్రి మాత్రం తమ పెళ్ళికి ఒప్పుకోలేదు.
దీంతో అనసూయ అతడిని మర్చిపోలేక అలా 9 ఏళ్లపాటు అతడిని పై మరింత ప్రేమ పెంచుకొని.ఆ తర్వాత తన తండ్రికి మరోసారి తన ప్రేమ గురించి చెప్పటంతో.
తన కూతురుది నిజమైన ప్రేమ అని తెలుసుకొని ప్రేమించిన వ్యక్తితో అనసూయకు పెళ్లి చేశాడు.నిజానికి తల్లిదండ్రులు వద్దంటే కొందరు వెళ్ళిపోయి పెళ్లి చేసుకోవడం లేదా తల్లితండ్రులు చెప్పిన పెళ్లిలు చేసుకోవడం లాంటివి చేస్తుంటారు.
కానీ అనసూయ అలా కాకుండా ఇంట్లో తన ప్రేమ గురించి చెప్పిన తర్వాత ఒక తొమ్మిదేళ్లు మళ్లీ ఎవరిపై మనసు పారేసుకోకుండా ప్రేమించిన వ్యక్తిని దక్కించుకోవడం కోసం బాగా ఆరాటపడిందని అర్థం అవుతుంది.