2 పాత్రలు.. 10 మంది నటులు.. వామ్మో ఈ దర్శకుడు మామూలోడు కాదు?

సినిమా విడుదలైన తర్వాత థియేటర్ కు వెళ్లిన ప్రేక్షకులు రెండున్నర గంటలపాటు సినిమాలు వీక్షిస్తూ ఉంటారు.రెండున్నర గంటలపాటు సినిమా చూసి అలా ఉంది ఇలా ఉంది అంటూ ఎన్నో చెబుతుంటారు.

 Do You Know These Facts About Arya And Bala Movie Nene Devunni Details, Director-TeluguStop.com

కానీ రెండున్నర గంటల సినిమా వెనుక ఎంతమంది కష్టం ఉంది అన్న విషయాన్ని కొన్ని కొన్ని సార్లు ప్రేక్షకులు గుర్తుంచుకోరూ.ముఖ్యంగా దర్శక నిర్మాతలు ప్రేక్షకుడికి ఇది తక్కువైంది అని ఎక్కడా అనిపించకుండా పాత్రల విషయంలో పాత్రలకు సూటయ్యే నటుల ఎంపిక విషయంలో కూడా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు.

ఇలా కాస్త ఎక్కువగానే జాగ్రత్తలు తీసుకునే వారిలో దర్శకుడు బాల ఒకరు.

ఆయన దర్శకత్వంలో వచ్చిన ఒక సినిమా గురించి తెలిస్తే బాల నటుల విషయంలో ఎంతో ఖచ్చితత్వంతో ఉంటారు అన్న తెలుస్తుంది.

అనగనగా 2004 అప్పుడే నాన్ కడవుల్ అనే సినిమా మొదలైంది.సినిమాలు తెలుగులో నేనే దేవున్ని అనే పేరుతో డబ్ చేశారు.ఇక ఈ సినిమా బాల కు జాతీయ అవార్డు తీసుకువచ్చింది.మొదట ఈ సినిమాకు అజిత్ హీరోగా అనుకున్నారు.

ఎమ్ ఎమ్ రత్నం నిర్మాత.కానీ వేరే సినిమా షూటింగ్ వల్ల ఆయన కొంతకాలానికి నిర్మాణం నుంచి తప్పుకున్నారు.2006 వరకు అజిత్ ఈ సినిమా కోసం ఎక్కువగా జుట్టు పెంచుకునమన్నారు.దీంతో ఇతర సినిమాలకు కూడా ఒప్పుకోలేదు.

కళ్ళు కాయలు కాసేలాఎదురుచూసిన అజిత్ చివరికి ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నారు.

Telugu Narine, Actress Pooja, Ajith, Anjali, Arya, Bala, Suriya, Surya, Karthika

ఇక ఆ తర్వాత సూర్య ని సంప్రదిస్తే డేట్లు కుదరలేదు.అటు వెంటనే నటుడు నరైన్ ఆప్షన్ గా తీసుకుంటే కొత్త నటుడు కావడంతో బాల వద్దన్నారు.చివరికి ఆర్య ఫిక్స్ అయిపోయారు.

ఆ తర్వాత సినిమాలో కీలక పాత్రలో ఒక అందురాలైన బిచ్చగత్తె పాత్ర ఉంటుంది అయితే మలయాళ నటి గోపిక చెల్లెలు ఈ పాత్ర కోసం అనుకున్నారు.కానీ ఆ తర్వాత వద్దనుకుని మీరాజాస్మిన్ ను అనుకున్నారు.

ఆమెను వద్దనుకుని చివరికి భావనను ఫిక్స్ చేశారు.భావనతో కొన్ని పోస్టర్లు కూడా బయటికి వచ్చాయ్.

Telugu Narine, Actress Pooja, Ajith, Anjali, Arya, Bala, Suriya, Surya, Karthika

గానీ ఏమైందో చివరికి ఆమె కూడా తప్పుకుంది.తర్వాత తెలుగు నటి అంజలి మలయాళ నటి పార్వతి పాత్ర కోసం అనుకున్నారు.చివరికి హీరోయిన్ కార్తీక ను కూడా ఈ పాత్రకు తీసుకోవాలనుకున్నారు.కానీ సెట్ కాలేదు అని బాలాకి అనిపించింది .ఇక చివరికి నటి పూజను ఈ పాత్రకోసం ఫైనల్ చేశారు.ఇలా బాల ఒక పాత్ర కోసం నటీనటుల ఎంపిక విషయంలో ఖచ్చితత్వం ఉంటాడు అన్నది ఈ ఒక్క ఘటనతో తెలిసిపోతుందని అభిమానులు అంటూ ఉంటారు.

చివరికి ఈ సినిమా 2009 లో విడుదలైంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube