రైళ్లను ఎలా శుభ్రం చేస్తారో తెలుసా.. వీడియో వైరల్

మనమందరం ఏదో ఒక సమయంలో భారతీయ రైళ్లలో ప్రయాణించి ఉంటాం.కాలుష్యం, వాతావరణం కారణంగా రైలు బయటి భాగం మురికిగా ఉంటోంది.

 Do You Know How To Clean Trains Video Viral , Train, Clean Trains, Viral Latest-TeluguStop.com

ఇది కొందరికి చిరాకుగా అనిపిస్తుంది.రైళ్లను శుభ్రం చేయరనే అపవాదు ఉంది.

అయితే ఇండియన్ రైల్వే ప్రతి ఏటా మెరుగు పడుతూ వస్తోంది.సరికొత్త టెక్నాలజీ అందిపుచ్చుకుని ముందుకు సాగుతోంది.

ఇక రైళ్లను శుభ్రం చేయడంలో సరికొత్త టెక్నాలజీని ఇండియన్ రైల్వే ఉపయోగిస్తోంది.మునుపటి కంటే రైళ్లు, కోచ్‌లు శుభ్రం చేయడంలో చాలా మార్పు వచ్చింది.

దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

భారతీయ రైల్వే దినదినాభివృద్ధి చెందుతోంది.విదేశాలను తలదన్నేలా హై స్పీడ్ రైళ్లు ప్రస్తుతం దేశవ్యాప్తంగా పట్టాలెక్కుతున్నాయి.ప్రయాణ సమయాన్ని సగం తగ్గించే వేగవంతమైన వందే భారత్ రైళ్లు అందుబాటులోకి వచ్చేశాయి.

ఈ తరుణంలో రైళ్లు శుభ్రంగా ఉండవనే అపవాదును తొలగించేందుకు రైల్వే సన్నద్ధం అయింది.గతంలో, ప్రస్తుతం రైళ్లను ఎలా శుభ్రపరిచే వారో తెలిపే ఓ వీడియోను రైల్వే మంత్రిత్వ శాఖ తాజాగా సోషల్ మీడియాలో విడుదల చేసింది.

ఈ వీడియోలో రైళ్లను శుభ్రపరిచే క్రమంలో ఎన్ని మార్పులు వచ్చాయో తెలపడానికి రైల్వేల మంత్రిత్వ శాఖ ప్రయత్నించింది.గతంలో రైళ్ల వెలుపలి భాగాలను చేతితో రుద్దుతూ శుభ్రం చేసేవారు.

ప్రస్తుతం పరిస్థితి మారింది.ఆటోమేటిక్ రైల్వే కోచ్ వాషింగ్ ప్లాంట్ పలు చోట్ల అందుబాటులోకి వచ్చింది.

మనిషి ప్రమేయం లేకుండానే రైళ్లను అద్దంలా శుభ్రం చేసేలా ఇవి ఉపయోగపడతాయి.విదేశాల్లో మాత్రమే ఇలాంటివి కనిపిస్తాయని అంతా భావిస్తారు.అయితే మన దేశంలోనూ ఇలాంటి అధునాత వ్యవస్థ అందుబాటులోకి వచ్చిందని తెలిపే ప్రయత్నం తాజా వీడియో ద్వారా రైల్వే శాఖ చేసింది.అంతేకాకుండా రైళ్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తున్నామని, రైళ్లలో చెత్త వేయకుండా సహకరించాలని కోరింది.

ఇటీవల వందే భారత్ రైళ్లలో చెత్త ఉండడంపై రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ స్పందించారు.రైళ్లను శుభ్రంగా ఉంచుకునే బాధ్యత ప్రయాణికులపైనా ఉందని విజ్ఞప్తి చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube