బత్తాయి సాగుకు ఈదురుగాలు లేని ప్రాంతాలతో పాటు, సముద్రమట్టం నుండి 900 మీటర్ల ఎత్తు వరకు ఉండే ప్రాంతాలు కూడా అనుకూలంగా ఉంటాయి.నేలలో 6.5 నుంచి 7.5 వరకు ఉదజిని సూచిక ఉండే, నీరు నిలవలేని ఎర్రగనప నేలలు, తేలికపాటి నల్ల భూములు చాలా అనుకూలంగా ఉంటాయి.ఇక బత్తాయి సాగులో ప్రధానమైనవి అంట్లు.వైరస్ తెగుళ్లు, వెర్రి తెగుళ్లు, గ్రీనింగ్, మొజాయిక్, ట్రిస్టిజా లాంటివి లేని అంట్లు ఎంచుకోవాలి.తర్వాత వేరు పైనుండి 15 సెంటీమీటర్లు ఎత్తు పెరిగిన అంట్లను ఎంపిక చేసుకోవాలి.ఆకుల మధ్య పరిమాణం మధ్యస్థంగా ఉంటూ, కణుపుల మధ్య దూరం దగ్గరగా ఉన్న అంట్లు ఎంపిక చేసుకోవాలి.అంటు కట్టిన తర్వాత ఆరు నుంచి పది నెలల వయసు గల అంట్లు ఎన్నుకోవాలి
మొదట నేలను బాగా దుక్కి దున్ని దున్నడం ద్వారా కలుపు సమస్య ఎక్కువగా ఉండదు.మొక్కలు నాటడానికి ఒక నేల ముందు 1 x 1 x 1 మీటరు పరిమాణం గల నాలుగు గుంతలను తవ్వుకోవాలి.ప్రతి గుంతలో 40 కిలోల పశువుల ఎరువు, ఒక కిలో సూపర్ ఫాస్ఫేట్, 100 గ్రాముల 10% లిండెన్ పొడి వేసి మట్టితో నింపాలి.
మొసంబి, బటావియన్, సాత్ గుడి లాంటి రకాలు అయితే అధిక దిగుబడి పొందవచ్చు.నేలలో సారవంతాన్ని బట్టి మొక్కలను 6 x 6 లేదా 8 x 8 దూరంలో నాటుకోవాలి.బత్తాయి సాగుకు నిరంతరం నీరు అందించాలి.
నీటి ఎద్దడి ప్రాంతాల్లో తేమ ఆవిరి కాకుండా వరిపొట్టు, వేరుశనగ పొట్టు, ఎండాకులు 8 సెంటీమీటర్ల మందంతో మొక్కల పొదల చుట్టూ పరచాలి.ఇక చెట్టుపై పూత, పిందెలు ఉన్నప్పుడు నీటి కొరత లేకుండా చూసుకోవాలి.
నీరు ఎంత అవసరం అవుతుంది అనేది వాతావరణం, చెట్ల వయస్సు, నేలపై ఆధారపడి ఉంటుంది.ఎరువులు అందించడం కోసం పాదులు తవ్వేటప్పుడు మొక్క వేర్లకు హాని కలుగకుండా తేలికపాటి సేద్యం చేయాలి.