వ్యవసాయంలో మైకోరైజా వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో తెలుసా..?

శిలీంద్రాలు అనేవి భూమి కింద ఒక నెట్వర్క్ లాగా ఏర్పడి పోరుగు మొక్కల మూల వ్యవస్థను కలుపుకుంటాయి.మొక్కల మార్గాల చుట్టూ విస్తృతంగా వ్యాపించిన మైసిలియా( Mycelia ) ద్వారా శిలీంద్రాలు బాస్వరం మరియు నత్రజని తో సహా నీరు ఇంకా ఇతర ఖనిజాలను ఒక్కొక్కటిగా వేరు వ్యవస్థకు అందిస్తాయి.

 Do You Know How Many Uses Mycorrhiza Has In Agriculture , Mycorrhiza, Agricultur-TeluguStop.com

మొక్క మరియు శిలీంద్రాలు ఒకదానికొకటి తోడ్పడడాన్ని మైకోరైజా( Mycorrhiza ) అంటారు.ఒక చెట్టు వేరు వ్యవస్థను గమనించినట్లయితే అందులో దాదాపు 30 రకాల మైకోరైజా ఉంటాయి.

బలంగా ఉండే మొక్కల నుండి పోషకాలను బలహీనంగా ఉన్న మొక్కలకు కూడా అందజేస్తాయి.

Telugu Agriculture, Mycelia, Mycorrhiza, Compost-Latest News - Telugu

ప్రస్తుతం రసాయనిక ఎరువుల ( Chemical fertilizers )వాడకం పెరగడం వల్ల మొక్కకు తోడ్పడే శిలీంద్రాలు క్షీణించిపోతున్నాయి.మైకోరైజా వల్ల మొక్కలకు కలిగే ప్రయోజనాలు ఏమిటో చూద్దాం.మొక్కకు అన్ని పోషకాలు సమృద్ధిగా అంది, వేగంగా పెరగడంలో ఈ శిలీంద్రాలు కీలక పాత్ర పోషిస్తాయి.

నీటి శోషణ ప్రాంతాన్ని 50 రెట్లు పెంచుతుంది.మొక్క యొక్క మూల వేరు వ్యవస్థకు లోతులో ఉన్న పోషకాలు ఇంకా నీటిని అందుకొని మొక్కకు ఆకులకు వేరు వ్యవస్థకు అందిస్తుంది.

మొక్కకు పోషకాలు అందుకునే సామర్థ్యాన్ని పెంచుతుంది.

Telugu Agriculture, Mycelia, Mycorrhiza, Compost-Latest News - Telugu

మొక్క వేర్లకు, మైకోరైజా కు మంచి అనుబంధం ఉంటే మొక్క నీటిని సమర్థవంతంగా ఉపయోగించుకోగలుగుతుంది.అంతే కాకుండా నీటి ఒత్తిడిని తట్టుకోగలుగుతుంది.నేల నిర్మాణానికి సచ్చిద్రత మెరవడానికి ఈ మైకోరైజా తోడ్పడుతుంది.ఈ మైకోరైజా ను ఎలా ఉపయోగించాలంటే.50 కిలోల కుళ్ళిపోయిన కంపోస్ట్ లేదా వరి కంపోస్ట్( Rice compost ) లేదా పొలం మట్టిలో 4 కిలోల మైకోరైజా పొడిని వేసి బాగా కలిపి ఒక ఎకరం పొలంలో ఏక రీతిగా చల్లుకోవాలి.పంట వేసిన 30 రోజుల తర్వాత మళ్లీ ఇదే పద్ధతి ద్వారా మైకోరైజా ను చల్లుకోవాలి.ఒకవేళ కావాలనుకుంటే విత్తనంతో పాటు కూడా మైకోరైజా పొడిని కలిపి వేసుకోవచ్చు.50 గ్రాముల మైకోరైజా ను 100 గ్రాముల చక్కరి పాకంలో కలిపి, ఈ మిశ్రమమును విత్తనానికి పట్టించి పొలంలో విత్తుకోవచ్చు.ఈ మైకోరైజా వల్ల మొక్కకు కావలసిన పోషకాలు అన్ని సమృద్ధిగా అందడం, మొక్క ఆరోగ్యకరంగా పెరగడం, మంచి దిగుబడి సాధించడం జరుగుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube