వాహనదారులకు ఈ విషయం తెలుసా? వెహికల్‌ నెంబర్‌ ప్లేట్‌ నిబంధనలను కేంద్రం సవరించింది!

వాహనదారులాగా ఇలాంటి విషయాలు ఎప్పటికప్పుడు మీరు తెలుసుకుంటే బావుంటుంది.తాజాగా వెహికల్‌ నెంబర్‌ ప్లేట్‌ నిబంధనలను కేంద్రం సవరించింది.

 Do Motorists Know This ,vehicles, Central Government, Rules,key Decision, Number-TeluguStop.com

BH (భారత్‌ సిరీస్‌) వాహన రిజిస్ట్రేషన్‌ విధానాన్ని మరింత విస్తరించేందుకు వీలుగా నిబంధనల్లో సవరణలను కేంద్ర రవాణా, రహదారుల శాఖ ప్రతిపాదించింది.ఇప్పటికే వివిధ రాష్ట్రాల పరిధిలో రిజిస్టర్‌ అయిన వాహనాలను భారత్‌ సిరీస్‌ కిందకు మార్చేందుకు అనుమతించనుంది.

ప్రస్తుతం కొత్త వాహనాలే బీహెచ్‌ సిరీస్‌ కింద నమోదుకు అవకాశం ఉంది.

BH సిరీస్‌ నిబంధనల్లో సవరణలతో కూడిన ముసాయిదా నోటిఫికేషన్‌ను కేంద్ర రవాణా, రహదారుల శాఖ విడుదల చేసింది.

BH సిరీస్‌ కింద నమోదైన వాహనాన్ని ఒక వ్యక్తి మరో వ్యక్తికి విక్రయించినప్పుడు.ఇదే సిరీస్‌ కింద అర్హత ఉన్నా, లేకపోయినా కొనుగోలుదారు పేరిట వాహన రిజిస్ట్రేషన్‌ సాఫీ బదిలీకి అనుమతించే నిబంధనను కూడా ప్రవేశపెట్టారు.

ప్రస్తుతం రెగ్యులర్‌ రిజిస్ట్రేషన్‌ కింద ఉన్న వాహనాలు పన్ను చెల్లించడం ద్వారా బీహెచ్‌ సిరీస్‌కు మారొచ్చు.చట్టంలోని 48వ నిబంధనకు సవరణను ప్రతిపాదించారు.

Telugu Bh, Central, Key, Number Plates, Vehiclenumber, Vehicles-Latest News - Te

BH సిరీస్‌ రిజిస్ట్రేషన్‌ కోసం నివాసం ఉండే చోట లేదంటే పనిచేసే ప్రాంతం నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు.వివిధ రాష్ట్రాల పరిధిలో వాహన రిజిస్ట్రేషన్ల సాఫీ బదిలీకి, ఉద్యోగ రీత్యా వివిధ రాష్ట్రాల మధ్య మారే వారు.వాహనాల రిజిస్ట్రేషన్‌ మార్చుకోవాల్సిన అవసరం లేకుండా BH సిరీస్‌ను గతేడాది సెప్టెంబర్‌లో BH సిరీస్‌ను కేంద్ర రవాణా శాఖ తీసుకురావడం గమనార్హం.కాబట్టి ఈ విషయాన్ని మీరు తెలుసుకోవడం ద్వారా మిగతావారు కూడా తెలుసుకుంటారని మనవి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube