ఫామ్ హౌజ్ ప్రలోభాల కేసులో నిందితుల కస్టడీ పిటిషన్ పై ఏసీబీ కోర్టు విచారణ జరిపింది.ఈ నేపథ్యంలో ముగ్గురు నిందితులు రామచంద్ర భారతి, సింహయాజి, నందకుమార్ లను కస్టడీకి కోరుతూ సిట్ దాఖలు చేసిన పిటిషన్ ను ఏసీబీ కోర్టు తిరస్కరించింది.
నిందితులను ఐదు రోజుల కస్టడీకి ఇవ్వాలని సిట్ పిటిషన్ లో పేర్కొంది.సిట్ వేసిన పిల్ ను తోసిపుచ్చిన ఏసీబీ కోర్టు.
పిటిషన్ ను కొట్టివేసింది.గతంలో నిందితులను రెండు రోజులపాటు పోలీస్ కస్టడీకి న్యాయస్థానం అనుమతి ఇచ్చింది.
ఈ నేపథ్యంలో మరోసారి కస్టడీకి ఇవ్వలేమని కోర్టు స్పష్టం చేసింది.