పాన్ ఇండియా స్టార్ ప్రభాస్( Prabhas ) బాహుబలి వంటి బ్లాక్ బస్టర్ తర్వాత నటిస్తున్న భారీ బడ్జెట్ సినిమాల్లో ”ప్రాజెక్ట్ కే”( Project K ) ఒకటి.నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా గురించి నిన్నటి నుండి సెన్సేషనల్ వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే.
ఈ సినిమాలో లోకనాయకుడు కమల్ హాసన్( Kamal Hasan ) విలన్ గా నటిస్తున్నాడు అని ఈయన ప్రభాస్ కంటే ఎక్కువ పారితోషికం డిమాండ్ చేస్తున్నాడు అని టాక్ వచ్చిన విషయం తెలిసిందే.
ఈ విషయంలో ఇంకా క్లారిటీ రానే లేదు ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ లో భాగం అయిన మరో బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ( Disha Patani ) గురించి నెట్టింట ఒక వార్త వైరల్ అయ్యింది.
ఈ సినిమాలో ఇప్పుడు ఆమెపై ఒక సాలిడ్ యాక్షన్ షూటింగ్ చేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి.ఈ విషయంలో ఇప్పుడు క్లారిటీ తెలుస్తుంది.
దిశా పటానీ పై యాక్షన్ సన్నివేశాల షూట్ జరుగుతున్న విషయం నిజమే కానీ ఈ సినిమా కోసం కాదని ప్రభాస్ టీమ్ క్లారిటీ ఇచ్చేసింది.దీంతో దిశా పటానీ నటిస్తున్న మరో మూవీ షూట్ అని తెలుస్తుంది.ప్రజెంట్ శరవేగంగా షూటింగ్ జరుగుతున్న ఈ సినిమా అప్డేట్ కోసం డార్లింగ్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.
ఒక వైపు షూట్ పూర్తి చేసుకుంటూనే మరో వైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా ఏకకాలం లోనే పూర్తి చేస్తున్నారు.ఇక వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్టు యూనిట్ సభ్యులు ప్రకటించారు.ఈ లోపు లోనే ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేసి సినిమాపై భారీ హైప్ పెంచనున్నారు.
దీపికా పదుకొనె, అమితాబ్ బచ్చన్ వంటి భారీ తారాగణం భాగం అయిన ఈ సినిమాను అశ్వనీదత్ 500 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.