తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి దర్శకుడుగా గుర్తింపు పొందిన ప్రశాంత్ వర్మ( Prasanth Varma ) రీసెంట్ గా ఆయన చేసిన హనుమాన్ సినిమాతో సూపర్ సక్సెస్ ను అందుకున్నాడు.ఇక దాంతో ఇప్పుడు పెద్ద సినిమాని చేయబోతున్నట్టుగా తెలుస్తుంది.
అయితే అందులో భాగంగానే హనుమాన్ సినిమా( Hanuman Movie ) సూపర్ సక్సెస్ అవడంతో పాటుగా, ఇప్పుడు ఆయన మాట్లాడుతున్న మాటలు కూడా వైరల్ గా మారుతున్నాయి.
ఎందుకంటే ప్రభాస్( Prabhas ) హీరోగా వచ్చిన ఆదిపురుష్ సినిమా( Adipurush ) గురుంచి మాట్లాడుతూ ఈ సినిమాలో కొన్ని సీన్లు నేనైతే బాగా చేసే వాడిని అంటూ కామెంట్లు చేశాడు.
అలాగే రాజమౌళి( Rajamouli ) మీద కూడా కొన్ని కామెంట్లు చేశాడు.దీనివల్ల ఆయన వ్యక్తిగతంగా చాలావరకు లాస్ అవుతున్నట్టుగా తెలుస్తుంది.అలాగే చాలామంది సినీ మేధావులు సైతం ఇవన్నీ ప్రశాంత్ వర్మ కి అనవసరమైన విషయాలు అంటూ తెలియజేస్తున్నారు.
నిజానికి హనుమాన్ సినిమాని ప్రశాంత్ వర్మ చాలా బాగా తీశాడు.ఎక్కడ బ్యాడ్ గా చూపించకుండా చాలా గొప్పగా చూపించే ప్రయత్నం చేస్తూనే హనుమంతుడి క్యారెక్టర్ కూడా చాలా బాగా డిజైన్ చేసుకున్నాడు.ఇక ఈ క్రమంలో ఈ సినిమాలో హీరోగా నటించిన తేజ సజ్జా( Teja Sajja ) కూడా చాలా బాగా నటించాడు.
ఇక ఇప్పుడు జై హనుమాన్ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో ప్రశాంత్ వర్మ చాలా బిజీగా ఉన్నాడు.
అయినప్పటికీ ఆయన చేసే సినిమాలు చాలా ఫాస్ట్ గా చేయడమే కాకుండా మంచి ఔట్ పుట్ తో చేయడమే తనకు ఇష్టమని ఇప్పటికి చాలాసార్లు చెప్పాడు.ఇక ఆయన చేయబోయే జై హనుమాన్ సినిమాలో హనుమాన్ గా ఎవరు నటిస్తున్నారు అనేది గత కొన్ని రోజులుగా విపరీతమైన వైరల్ అవుతుంది.ఇక ఇది ఇలా ఉంటే ఈ దర్శకుడు చేసిన కామెంట్లు ప్రస్తుతం ఆయనకు విమర్శలను తీసుకొచ్చి పెడుతున్నాయి…