తెలుగు సినిమాల్లో విలన్ రోల్స్ లో, హీరో రోల్స్ లో నటించి శ్రీహరి మంచి గుర్తింపును సాధించారనే సంగతి తెలిసిందే.ఎవరైనా సహాయం కోరితే వెంటనే సహాయం చేసే నటుడిగా శ్రీహరికి పేరుంది.
స్టంట్ మాస్టర్ గా కెరీర్ ను మొదలుపెట్టిన శ్రీహరి ధర్మక్షేత్రం సినిమాతో హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా గుర్తింపును సంపాదించుకున్నారు.పోలీస్ మూవీ శ్రీహరికి నటుడిగా మంచి పేరు దక్కింది.
ఒకవైపు హీరోగా చేస్తూనే మరోవైపు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి శ్రీహరి ఎన్నో సంచలన విజయాలను సొంతం చేసుకున్నారు.తెలంగాణ యాసలో పలు సినిమాల్లో శ్రీహరి చెప్పిన డైలాగ్స్ ఆయా సినిమాలు సక్సెస్ కావడానికి కారణమయ్యాయి.
శ్రీహరి డిస్కో శాంతిని ప్రేమించి వివాహం చేసుకున్నారు.శ్రీహరి నాలుగు గ్రామాలను దత్తత తీసుకున్నారు.
కాలేయ సంబంధిత సమస్యల వల్ల శ్రీహరి చనిపోయారు.
టాలీవుడ్ దర్శకుడు నాగు గవర ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ వీకెండ్ లవ్ నాకు చాలా సంతృప్తిని ఇచ్చిన సినిమా అని ఆ సినిమాలో అందరూ సీనియర్ యాక్టర్లు నటించారని చెప్పుకొచ్చారు.
ఆ సినిమా మేకింగ్ చాలా క్వాలిటీగా ఉంటుందని నాగు గవర తెలిపారు.ఆ సినిమా క్లైమాక్స్ షూటింగ్ బ్యాలెన్స్ ఉండగా శ్రీహరి చనిపోయారని నాగు గవర చెప్పుకొచ్చారు.ఆ సీన్ ను మార్చి రావు రమేష్ పాత్రతో షూటింగ్ పూర్తి చేశామని నాగు గవర తెలిపారు.చిరంజీవి గారిని ఇన్స్పిరేషన్ గా తీసుకొని సినిమాల్లోకి వచ్చానని నాగు గవర అన్నారు.
చిరంజీవిని చాలా సందర్భాల్లో కలిశానని కానీ ఆయనతో ఒక్క ఫోటో కూడా దిగలేదని నాగు గవర చెప్పుకొచ్చారు.కాకినాడలో చిరంజీవి నటించిన మృగరాజు సినిమా కూడా 100 రోజులు ఆడిందని నాగు గవర అన్నారు.