రసాయనాలు అధికంగా ఉండే షాంపూ ను వినియోగించడం, హెయిర్ స్టైలింగ్ టూల్స్ ( Hair styling tools )ను అధికంగా వాడటం, వేడివేడి నీటితో తల స్నానం చేయడం, ఎండల ప్రభావం, పోషకాల కొరత తదితర కారణాల వల్ల జుట్టు పెళుసుగా మారి ముక్కలు అయిపోతూ ఉంటుంది.మనలో చాలామంది ఈ సమస్యను ఫేస్ చేస్తూ ఉంటారు.
కానీ దీన్ని ఎలా పరిష్కరించుకోవాలో తెలియక తెగ హైరానా పడిపోతుంటారు.అయితే వర్రీ వద్దు.
ఇప్పుడు చెప్పబోయే వండర్ ఫుల్ హోమ్ రెమెడీని ట్రై చేస్తే మీ సమస్యకు పరిష్కారం దొరికినట్లే.మరి ఇంతకీ ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి.

ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఎగ్ ను ( Egg )బ్రేక్ చేసి వైట్ ను మాత్రం వేసుకోవాలి.ఈ ఎగ్ వైట్ లో అర కప్పు హోమ్ మేడ్ కొబ్బరి పాలు, వన్ టేబుల్ స్పూన్ విటమిన్ ఈ ఆయిల్ ( Vitamin E oil )వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి.దాదాపు 5 నిమిషాల పాటు స్పూన్ సహాయంతో కలపాలి.ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి ఒకటికి రెండుసార్లు పట్టించి మసాజ్ చేసుకోవాలి.
ఆపై షవర్ క్యాప్ ధరించాలి.గంట లేదా గంటన్నర అనంతరం మైల్డ్ షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.

వారానికి ఒకటి లేదా రెండు సార్లు ఈ రెమెడీని కనుక పాటిస్తే పెళుసుగా మారిన మీ జుట్టు మళ్ళీ హెల్తీ గా మారుతుంది. ఎగ్, కొబ్బరిపాలు, విటమిన్ ఈ ఆయిల్ లో ఉండే పోషకాలు జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.హెయిర్ రూట్స్ ని బలోపేతం చేస్తాయి.పెళుసుగా మారిన జుట్టును రిపేర్ చేస్తాయి.జుట్టు చిట్లడం, విరగడం వంటి సమస్యలకు అడ్డుకట్ట వేస్తాయి.హెయిర్ గ్రోత్ ను ఇంప్రూవ్ చేస్తాయి.
అదే సమయంలో జుట్టును సిల్కీగా( Hair silky ), షైనీ గా మెరిపిస్తాయి.కాబట్టి ఆరోగ్యమైన జుట్టును పొందాలనుకునేవారు తప్పకుండా ఈ రెమెడీని పాటించండి.