బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ ( Anurag Kashyap )గురించి మనందరికీ తెలిసిందే.ఇతను బాలీవుడ్ లో పలు సినిమాలకు దర్శకుడిగా వ్యవహరించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నారు.
అయితే ఆయన సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి పూర్తి అయినా కూడా 20 ఏళ్ల దర్శకత్వ ప్రస్థానంలో ఆయన స్టార్ హీరోలతో పనిచేయలేదు.తాజాగా ఇదే విషయం గురించి ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు అనురాగ్ కశ్యప్.
ఈ సందర్భంగా ఇంటర్వ్యూలో భాగంగా ఆయన మాట్లాడుతూ… నేను సినిమాలు తీయడానికే ఇండస్ట్రీలోకి వచ్చాను.
అయితే ఒకానొక సమయంలో స్టార్ల వెంటపడడం తప్పలేదు.స్టార్లు లేకుండా నువ్వు ఈ ప్రాజెక్టు చేస్తున్నావ్.ఒకవేళ ఇదే మూవీలో స్టార్లు ఉంటే ఎలా ఉంటుందో ఊహించుకో అని చాలామంది నాకు సలహా ఇచ్చేవారు.
స్టార్లుగా పేరొందిన వారికి అశేష అభిమానులు ఉంటారు.ఆ అభిమాన గణాన్ని దృష్టిలో పెట్టుకోవడం వల్ల స్టార్లతో ప్రయోగాత్మక చిత్రాలు తెరకెక్కించడం కష్టం.
అందుకే షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్( Shah Rukh Khan ) లాంటి వారితో నేను సినిమాలు చేయాలనుకోను.విదేశీ దర్శకులు హీరోల అభిమానుల కోసం సినిమాలు తీయరు.
అక్కడ స్వేచ్ఛ ఉంటుంది అని అభిప్రాయం వ్యక్తం చేశారు అనురాగ్ కశ్యప్.
ఈ సందర్బంగా ఇంటర్వ్యూలో భాగంగా ఆయన చేసిన వాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.అలాగే హీరోయిన్ అలియా భట్ గురించి మాట్లాడుతూ.దేశంలో ఉన్న ఉత్తమ నటుల్లో అలియా( Alia Bhatt ) కూడా ఒకరు.
ఆమెతో ఒక సినిమా తెరకెక్కించాలని ఉంది అని అనురాగ్ తన మనసులో మాటను బయట పెట్టారు.