వ్యక్తిగతంగా ఎవరూ స్పందించకండి.. సీఎం జగన్ ను కలుస్తాం: దిల్ రాజు

ప్రస్తుతం టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో మనందరికీ తెలిసిందే.ఒకవైపు కరోనా, ఒమిక్రాన్ సమస్యలు, మరొకవైపు థియేటర్లలో టికెట్ రేట్ల సమస్యలు.

 Dil Raju On Ap Tickets Price Issue And Hero Nani Comments Details,  Cm Jagan, Ap-TeluguStop.com

అయితే ఏపీ లో గత కొద్ది రోజులుగా టికెట్ రేట్లపై వివాదాలు నడుస్తూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే.టికెట్స్ రేట్స్ విషయంలో కొంతమంది ఏపీ ప్రభుత్వాన్ని సమర్థిస్తుంటే, ఇంకొందరు ఏపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు.

ఇకపోతే ఇటీవలే  హీరో నాని నటించిన శ్యామ్ సింగరాయ్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చేసిన వ్యాఖ్యలు ఏపీలో దుమారాన్ని రేపాయి.ఎక్కడ చూసినా కూడా నాని చేసిన వ్యాఖ్యల గురించి వార్తలు వినిపిస్తున్నాయి.

టికెట్ రేట్లు తగ్గించడం అంటే అభిమానులను అవమానించడమే.అలాగే థియేటర్ లలో కలెక్షన్ ల కంటే పక్కన ఉన్న కిరాన కొట్టు కలెక్షన్ లే ఎక్కువగా ఉన్నాయి అంటూ చేసిన వ్యాఖ్యలు ఏపీలో ప్రకంపనలు సృష్టించాయి.

ఈ వ్యాఖ్యలపై ఏపీ మంత్రులు కూడా సెటైర్లు వేశారు.ఇకపోతే ఏపీ సీఎం అపాయింట్మెంట్ కోసం ప్రస్తుతం సినీ పరిశ్రమ ఎదురు చూస్తోంది.

సీఎం జగన్ అపాయింట్మెంట్ ఇస్తే కలుస్తామని నిర్మాత దిల్ రాజు అన్నారు.ఈ సందర్భంగా నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.

సీఎం జగన్ ని కలిస్తే ఏపీ ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తోంది.థియేటర్లలోకి మళ్లీ పాత రోజులే వస్తాయి అంటూ ఆశాభావం వ్యక్తం చేశారు.

అంతేకాకుండా సినీ ఇండస్ట్రీలో ఏ ఒక్కరు కూడా వ్యక్తిగతంగా స్పందించ వద్దని ఈ సందర్భంగా సూచించారు.అందుకోసం సపరేట్ గా  కమిటీ వేస్తున్నామని, అందులో నిర్మాతలు, ఎగ్జిబ్యూటర్లు, డిస్ట్రిబ్యూటర్లు ఉంటారని చెప్పుకొచ్చారు.ఆ కమిటీ నిర్ణయం తీసుకున్న తర్వాత మళ్లీ మాట్లాడతాను అని నిర్మాత దిల్ రాజు పేర్కొన్నారు.అదేవిధంగా కష్టమో నష్టమో ముందుకు వెళ్దాం.సినిమాలను ఆపుకోలేము కదా అంటూ అలాగే టికెట్ల రేట్స్ ని పెంచిన తెలంగాణ ప్రభుత్వానికి  కృతజ్ఞతలు తెలిపారు.అలాగే ఈ సమస్యకు త్వరలోనే పరిష్కారం దొరుకుతుందని నిర్మాత దిల్ రాజు చెప్పుకొచ్చారు.

Dil Raju Press Meet on AP Movie Tickets Issue

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube