తెలుగు సినీ ఇండస్ట్రీలో మెగా అక్కినేని కుటుంబాలకు ఎంత మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయో మనకు తెలిసిందే.మెగా కోడలుగా ఉపాసన ( Upasana ) అంతే మంచి సక్సెస్ , పేరు ప్రఖ్యాతలు అందుకోగా అక్కినేని కోడలు అడుగుపెట్టినటువంటి సమంత( Samantha ) మాత్రం ఎక్కువ కాలం పాటు అక్కినేని అనే ట్యాగ్ తగిలించుకోలేక పోయారు.
అక్కినేని నాగచైతన్య ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటి సమంత కొంతకాలం పాటు నాగచైతన్యతో కలిసి ఉన్నప్పటికీ అనంతరం నాగచైతన్య ( Nagachaitanya ) నుంచి విడాకులు తీసుకుని విడిపోయారు.
ఇలా నాగచైతన్య చైతన్య నుంచి విడాకులు తీసుకున్నటువంటి సమంత తిరిగి సినిమాలలో బిజీ అయ్యారు.అయితే ఇలా సినిమాల పరంగా బిజీగా ఉన్న నేపథ్యంలోనే మయూసైటిస్ వ్యాధి కారణంగా సమంత ఒక్కసారిగా కృంగిపోయారు.ఈ వ్యాధి తనను తీవ్రంగా వెంటాడిందని చెప్పాలి ఈ వ్యాధి రావడంతో సమంత పూర్తిగా డల్ అవ్వడమే కాకుండా తీవ్రమైన సమస్యలను ఎదుర్కొన్నారు ఇలాంటి తరుణంలో ఈమెకు చాలా సహాయం చేశారట మెగా కోడలు ఉపాసన.
మయోసైటిస్( Myositis ) వ్యాధికి చికిత్స తీసుకోవడం కోసం సమంత పెద్ద డాక్టర్లను సంప్రదించాలని నిర్ణయం తీసుకున్నారట.ఈ క్రమంలోనే ముందుగా అపోలో హాస్పిటల్స్ సీఈవో అయినటువంటి ఉపాసనను కలిసి తన పరిస్థితి మొత్తం సమంత తెలియజేశారని, దీంతో సమంతకు ఉపాసన చాలా ధైర్యం చెప్పి వెంటనే తన తాతయ్య గారికి ఈ విషయం తెలియజేసి విదేశాలలో ఉన్నటువంటి పెద్ద పెద్ద డాక్టర్ లందరికీ రికమండేషన్ చేశారట.ఇలా ఉపాసన రికమండేషన్ కారణంగా సమంత ఎంతో మంచి ట్రీట్మెంట్ అందుకున్నారని ఈ వ్యాధి నుంచి బయటపడటానికి సమంతకు మెగా కోడలు చాలా సహాయం చేశారని ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియా( Social Media )లో వైరల్ గా మారింది.
ఇలా సమంత మాత్రమే కాకుండా ఉపాసన నుంచి ఎంతోమంది వివిధ రకాలుగా సహాయం అందుకున్నారు సినిమా ఇండస్ట్రీకి చెందినటువంటి సెలబ్రిటీలు ఎవరైనా ఆపదలో ఉన్నా కానీ ఉపాసన వారికి తన అపోలో హాస్పిటల్స్ ద్వారా అందించాల్సిన సహాయం మొత్తం అందిస్తూ ఉంటారు.
ఇలా ఇప్పటికే ఎంతో మందికి ఈమె సహాయం చేశారని ఈ విషయాన్ని స్వయంగా సెలబ్రిటీలే పలు సందర్భాలలో బయటపెట్టారు.తాజాగా ఉపాసన సమంతకు కూడా సహాయం చేశారనే వార్త తెలియడంతో మెగా అభిమానులు అటు సమంత అభిమానులు కూడా ఈమె చేసిన సహాయం పై ప్రశంసలు కురిపిస్తున్నారు.